శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో 12 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

Wait 5 sec.

దేశవ్యాప్తంగా రేపు (మార్చి 27 శుక్రవారం) వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు.. ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఈ నేపథ్యంలోనే రేపు హైదరాబాద్‌ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇక ఈ సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై.. కోఠిలోని హనుమాన్‌ వ్యాయామశాల వరకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే సీతారాంబాగ్-కోఠి మార్గంలో వాహనాలు వెళ్లేందుకు అనుమతులు నిరాకరించనున్నారు. శోభాయాత్ర జరగనున్నంత సేపు ఈ మార్గంలో ఉండే ట్రాఫిక్‌ను వేరే మార్గాల గుండా మళ్లించనున్నారు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు వాహనాలను దారి మళ్లించనున్నారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి ప్రయాణించే వాహనాలను టక్కర్‌వాడీ జంక్షన్ వైపు మళ్లించనున్నారు. ఎంజే బ్రిడ్జ్‌, బేగంబజార్‌, అఫ్జల్‌గంజ్‌, సిటీ కాలేజీ వైపు ప్రయాణించే వాహనాలను జుమేరాత్‌ బజార్‌ మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. అబిడ్స్‌ జీపీఓ, సుల్తాన్‌ బజార్‌, కోఠి, అబిడ్స్‌ వంటి మెయిన్ రోడ్లపైనా ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలోనే బేగంబజార్‌, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లోనూ వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా ట్రాఫిక్ చర్యలు చేపట్టేందుకు హైదరాబాద్‌ పోలీసులు రెడీ అవుతున్నారు.మరోవైపు.. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 3 వేల మంది సిబ్బందితోపాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో శోభాయాత్ర మార్గంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించనున్నారు. ఇటీవల సీతారాం బాగ్‌లోని ద్రౌపది గార్డెన్స్‌లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి చర్చించారు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై మాట్లాడారు.