: స్టాక్ మార్కెట్లలో లిస్టయిన కంపెనీలు మాత్రమే కాకుండా.. అన్‌లిస్టెడ్ కంపెనీలు కూడా ఉంటాయి. ఇవి ప్రైవేట్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతుంటాయి. సాధారణంగా మనం లిస్టింగ్ కంపెనీల షేర్లను NSE, BSE వంటి స్టాక్ ఎక్స్చేంజీల్లో కొనుగోలు చేస్తుంటాము. కానీ లిస్టింగ్ కాని కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు బయట ప్రైవేటుగా కొనుగోలు చేయొచ్చు. దీనినే గ్రే మార్కెట్ అని కూడా అంటారు. అక్కడ షేర్ ధర ఎంతుందో తెలుసుకోవచ్చు. ఇలానే అన్‌లిస్టెడ్ మార్కెట్లో.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో అత్యంత ఆదరణ కలిగి జట్లలో ఒకటి.. 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఉంది. అన్‌లిస్టెడ్ మార్కెట్లో సీఎస్కే షేర్ ధర ఒక్కసారిగా పుంజుకుంది. రికార్డు గరిష్ఠాలకు చేరుకుంది. సీఎస్కే షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డట్లు తెలుస్తోంది. గ్రే మార్కెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షేర్లు ఒక దశలో మార్చి 25న రూ. 315 స్థాయిలో ట్రేడయినట్లు తెలుస్తోంది. ఇది ఆ స్టాక్ ఆల్ టైమ్ హై అని నిపుణులు చెబుతున్నారు. ఈ విలువ వద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 11 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఈ స్టాక్ ధర రూ. 250-260 స్థాయిలో ఉండగా.. స్వల్పకాలంలోనే 25 శాతం వరకు పుంజుకుందని తెలుస్తోంది. >> ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో అన్‌లిస్టెడ్ మార్కెట్లో యాక్టివ్‌గా ఉన్నది సీఎస్కే మాత్రమే. 2015లో ఇండియా సిమెంట్స్ నుంచి డీమెర్జర్ (విభజన) నేపథ్యంలో ఇక్కడ షేర్లను ఇన్వెస్టర్లకు డిస్ట్రిబ్యూట్ చేశారు. దీంతో ఇవి గ్రే మార్కెట్లో ట్రేడవుతున్నాయి. ఇక్కడ ఇలా షేర్లు ఒక్కసారిగా పుంజుకునేందుకు ప్రధాన కారణం.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల విలువల్లో భారీ పెరుగుదల కనిపించడమే. మార్చి 24న.. . రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఫ్రాంఛైజీని రూ. 15,300 కోట్లు పెట్టి యూఎస్ టెక్ వ్యాపారవేత్త కల్ సోమనీ దక్కించుకున్నారు. 2008లో ఆర్సీబీ, ఆర్ఆర్ విలువ వరుసగా రూ. 500 కోట్లు, రూ. 300 కోట్లుగానే ఉండగా.. ఇప్పుడు ఈ స్థాయిలో 20 రెట్లకుపైగా పెరగడం గమనార్హం. దీంతోనే ఇతర ఐపీఎల్ టీం ఫ్రాంఛైజీలకు కూడా ఈ డీల్ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఈ క్రమంలోనే వాటి విలువ కూడా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉండొచ్చని.. దానికి అనుగుణంగా విలువ పెరుగుతుందని భావిస్తున్నారు. వాటిని మళ్లీ లెక్కగడితే వీటికంటే ఎక్కువే ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా సీఎస్కే షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదొక్కటే కాదు.. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్న ఐపీఎల్ ఫ్రాంఛైజీ మార్చి 25 సెషన్‌లో ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ సన్ టీవీ షేర్లు కూడా ఒక దశలో ఇంట్రాడేలో 5 శాతం పెరిగినా.. చివరికి 2 శాతం పతనమయ్యాయి.