ఈ బ్యాంకుల్లోనే అధిక వడ్డీ.. ఏకంగా 8 శాతం.. 2 లక్షలు జమ చేస్తే మూడేళ్లకు ఎంతొస్తుందంటే?

Wait 5 sec.

: డబ్బులపై మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీస్ పథకాలు, గోల్డ్, రియల్ ఎస్టేట్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా చాలానే ఉంటాయి. వీటిల్లో రిస్క్ ఉన్న స్కీమ్స్.. రిస్క్ లేనివి ఉంటాయి. రిస్క్ లేని వాటి విషయానికి వస్తే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలు వంటివి ఉన్నాయి. ఇక్కడ నిర్దిష్ట పెట్టుబడులపై.. నిర్దిష్ట కాల వ్యవధులపై గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. ఇంకా పెద్దగా రిస్క్ కోరుకోరు. కాబట్టి.. వీరు సురక్షిత పెట్టుబడి సాధనాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇందులోనూ పోస్టాఫీస్ పథకాల కంటే చాలా వరకు బ్యాంకులే సీనియర్ సిటిజెన్లకు అధిక వడ్డీ అందిస్తుంటాయి. సాధారణ ప్రజలతో పోలిస్తే వీరికి అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ ఆఫర్ చేస్తుంటాయి. ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు.. సీనియర్ సిటిజెన్లకు అధిక వడ్డీ అందిస్తున్నాయి. ఇప్పుడు మూడేళ్ల టెన్యూర్ డిపాజిట్లపై స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు దేంట్లో ఎలా ఉన్నాయి.. రూ. 2 లక్షలు జమ చేసినట్లయితే మెచ్యూరిటీకి అంటే మూడేళ్లకు రాబడి ఎంత వస్తుందో తెలుసుకుందాం. 3 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై సీనియర్ సిటిజెన్లకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో.. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటివి అత్యధికంగా 8 శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఇక్కడ 2 లక్షలు డిపాజిట్ చేస్తే మూడేళ్లకు వడ్డీ రూపంలోనే రూ. 53,648 వస్తుంది. మెచ్యూరిటీకి మొత్తం చేతికి రూ. 2,53,648 వస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.7 శాతం మేర వడ్డీ ఇస్తుండగా.. ఇక్కడ 2 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి రూ. 2,51,419 వస్తుంది. వడ్డీతో రూ. 51,419 వస్తుందన్నమాట. ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు.. మూడేళ్ల ఎఫ్‌డీపై సీనియర్ సిటిజెన్లకు 7.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక్కడ 2 లక్షలపై వడ్డీతో రూ. 50,680 వస్తుంది. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వంటివి 7.50 శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఇక్కడ 2 లక్షలు డిపాజిట్ చేసిన వారికి రూ. 49,943 వడ్డీ వస్తుంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేటు 7.45 శాతంగా ఉండగా.. ఇక్కడ 2 లక్షలపై రూ. 49,576 వడ్డీ వస్తుంది.