ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ.. త్వరలోనే లాంఛ్.. మస్క్ కంపెనీ టార్గెట్ రూ. 7 లక్షల కోట్లు!

Wait 5 sec.

: మీరు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇక్కడ రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తున్నారా? మీకు ఐపీఓల గురించి తెలిసే ఉంటుంది. దీనినే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (తొలి పబ్లిక్ ఆఫర్) అని, పబ్లిక్ ఇష్యూ అని చెబుతుంటారు. తొలిసారి షేర్ల విక్రయం ద్వారా పబ్లిక్‌ ఇష్యూకు రావడాన్ని ఐపీఓగా చెబుతుంటారు. ఇక్కడ షేర్ల విక్రయం ద్వారా నిధుల్ని సమీకరించి.. దీనిని అప్పులు తీర్చేందుకు.. ఇతర మూలధన అవసరాలకు.. వ్యాపార విస్తరణకు ఉపయోగిస్తుంటాయి కంపెనీలు. చాలా వరకు చూస్తే ఐపీఓలు లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా ఇస్తుంటాయి. అందుకే వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు జనం అత్యంత ఆసక్తి చూపిస్తుంటారు. తరచుగా ప్రతి వారం కొత్త కొత్త ఐపీఓలు మార్కెట్లో సందడి చేస్తూనే ఉంటాయి. ప్రముఖ సంస్థలు.. ప్రజాదరణ పొందిన కంపెనీల నుంచి వచ్చే ఐపీఓలకు మస్తు గిరాకీ ఉంటుంది. ఆఫర్ చేసి షేర్ల కంటే ఎన్నో రెట్ల షేర్లకు బిడ్స్ దాఖలు చేస్తుంటారు. 3-4 రోజుల సబ్‌స్క్రిప్షన్ పీరియడ్‌ కోసం ఎదురుచూసే వారెందరో. ఇప్పుడు మరో ప్రముఖ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచేందుకు సిద్ధమైంది. అదే కంపెనీ స్పేస్‌ఎక్స్. అవును.. ఈ కంపెనీ ఐపీఓకు ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుండగా.. ఇప్పుడు మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ వారం లేదా వచ్చే వారంలోనే కోసం పత్రాలు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తుల్ని ఉటంకిస్తూ రాయిటర్స్, బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఈ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 1.75 ట్రిలియన్ డాలర్లకుపైనే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది భారత కరెన్సీలో చూస్తే రూ. 164 లక్షల కోట్లకుపైగానే ఉంటుంది. ఐపీఓ ద్వారా సుమారు 75 బిలియన్ డాలర్ల మేర నిధుల్ని సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇది భారత కరెన్సీల ో రూ. 7 లక్షల కోట్లకుపైగానే ఉండనుంది. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ నిధులు సమీకరించిన సంస్థగా రికార్డు సృష్టించనుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం అతిపెద్ద ఐపీఓగా సౌదీ ఆరాంకో ఉంది. ఇది సుమారు 25 బిలియన్ డాలర్ల (రూ. 2 లక్షల కోట్లకుపైగా) వరకు నిధుల్ని సమీకరించింది. అదే ఇండియాలో చూస్తే ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27 వేల కోట్లకుపైగా సమీకరించి టాప్‌లో ఉండగా.. ఎల్ఐసీ రూ. 21 వేల కోట్లతో రెండో స్థానంలో ఉంది. పేటీఎం రూ. 18 వేల కోట్లతో మూడో స్థానంలో ఉంది.