: భారత స్టాక్ మార్కెట్ సూచీలు మార్చి 27 (శుక్రవారం) సెషన్‌లో మళ్లీ భారీగా పతనం అయ్యాయి. అంతకుముందు మార్చి 24,25 సెషన్లలో వరుసగా భారీ లాభాలు నమోదు చేయగా.. ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1690 పాయింట్ల పతనంతో 73,583 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 487 పాయింట్లు తగ్గి 22,820 వద్ద సెషన్ ముగించింది. ఎస్బీఐ, బీఎస్ఈ, రిలయన్స్, ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఇలా అన్ని హెవీవెయిట్ స్టాక్స్ దారుణంగా పతనం అయ్యాయి. ఈ ఒక్క సెషన్‌లోనే మదుపరుల సంపదగా పరిగణించే . ఇక్కడ ప్రధానంగా భారత్‌లో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు గురించి మాట్లాడుకోవాలి. శుక్రవారం సెషన్‌లో ఈ స్టాక్ దారుణంగా పడిపోయింది. మార్చి 25 సెషన్‌లో ఈ స్టాక్ ధర NSE లో రూ. 1413.10 వద్ద ముగియగా.. ఇవాళ దాదాపు ఒక శాతం నష్టంతో మొదలై అక్కడి నుంచి ఏ దశలోనూ పుంజుకోలేదు. ఇదే క్రమంలో ఇంట్రాడేలో 5 శాతం వరకు తగ్గి రూ. 1345 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4.61 శాతం పతనంతో రూ. 1348 వద్ద సెషన్ ముగించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఒక్కరోజులోనే ఈ స్థాయిలో పడిపోవడంతో మార్కెట్ విలువ కూడా భారీ స్థాయిలో దిగొచ్చింది. కిందటి రోజు రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 19.14 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా.. ఇవాళ అది రూ. 18.24 లక్షల కోట్లకు దిగొచ్చింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఈ మేరకు రూ. 90 వేల కోట్లు తగ్గింది. ఇంధనంపై విండ్‌ఫాల్ టాక్స్..రిలయన్స్ షేర్ ఈ స్థాయిలో పడిపోవడానికి స్టాక్ మార్కెట్ల పతనం ఒక్కటే కారణం కాదు. కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటనే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. క్రూడాయిల్ ధర రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి పెట్రోల్‌పై విధించకపోయినా డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 21.5.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌పై (ATF) లీటరుకు రూ. 29.5 చొప్పున విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. గతంలో . ఇప్పుడు ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరువకాగా.. దీనిని తీసుకురావాల్సి వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఓఎన్‌జీసీ లిమిటెడ్, ఆయిల్ ఇండియా వంటి కంపెనీలు దేశీయంగా ముడి చమురును శుద్ధి చేసి.. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఇతర ఏటీఎఫ్ వంటి ఇంధనాల్ని ఉత్పత్తి చేసి.. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటాయి. గతంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో 2022లో ఇలాగే క్రూడాయిల్ ధరలు పెరగ్గా.. ఈ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు దండుకున్నాయి. అప్పుడే కేంద్రం ఈ విండ్‌ఫాల్ టాక్స్ తీసుకొచ్చింది. తర్వాత ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో వరుసగా తగ్గిస్తూ వచ్చి చివరకు పూర్తిగా తొలగించింది. ఇప్పుడు మళ్లీ తీసుకురాగా.. ఆయా కంపెనీల మార్జిన్లపై ప్రభావం పడుతుంది. దీంతో షేర్ ధర కూడా ఒక్కసారిగా భారీగా దిగొచ్చింది.