Small Savings Schemes Interest Rates: మార్చి 30న కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి (స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్) వడ్డీ రేట్లను ఖరారు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగానే ఉంచుతున్నట్లు వెల్లడించింది. వరుసగా 8వ త్రైమాసికంలో కూడా ఈ వడ్డీ రేట్లను కేంద్రం మార్చకపోవడం గమనార్హం. చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ.. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లేదా పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి సవరిస్తుంటుంది. వడ్డీ రేట్లు ఇక్కడ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. చాలా కాలంగా మాత్రం వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతోంది. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికానికి సంబంధించి.. 2023 డిసెంబరులో వడ్డీ రేట్లను పెంచింది. అప్పుడు సుకన్య సమృద్ధి సహా.. పోస్టాఫీస్ మూడేళ్ల టెన్యూర్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచగా.. అప్పటి నుంచి వరుసగా 8వ త్రైమాసికంలో అన్ని పథకాలపై అవే వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి. మిగతా పథకాలతో పోలిస్తే ఈ పథకాల్లో అత్యంత ఆదరణ పొందిన స్కీమ్.. .. దీని రేటు పెంచుతుందని భావించినా ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. ఇంకా ఆడపిల్లల కోసం ఉద్దేశించిన గొప్ప పథకం సుకన్య సమృద్ధి పథకం వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆశించిన వారికి కూడా నిరాశే మిగిలింది. ప్రస్తుతం అన్ని పథకాల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్- 4 శాతంఏడాది టెన్యూర్ టైమ్ డిపాజిట్- 6.9 శాతంరెండేళ్ల టైమ్ డిపాజిట్ - 7 శాతంమూడేళ్ల టెన్యూర్ టైమ్ డిపాజిట్- 7.10 శాతంఐదేళ్ల టెన్యూర్ టైమ్ డిపాజిట్- 7.5 శాతంఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ - 6.70 శాతంసీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్- 8.2 శాతంమంత్‌లీ ఇన్‌కం అకౌంట్- 7.4 శాతంనేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ - 7.7 శాతంపబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - 7.10 శాతంసుకన్య సమృద్ధి యోజన- 8.2 శాతంఈ పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు కేంద్రం.. గవర్న్‌మెంట్ సెక్యూరిటీలపై ప్రతిఫలాన్ని (G-Sec Yields) ప్రాతిపదికగా తీసుకుంటోంది. బాండ్లపై ప్రతిఫలం ఎక్కువగా ఉన్నప్పుడే.. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటారు.