బంగారం ధరల్లో భారీ మార్పు.. రాత్రికి రాత్రే బిగ్ జంప్.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Wait 5 sec.

Latest : అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. బంగారం, వెండి ధరలు ఇటీవల యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే 3-4 రోజులు మినహా మిగతా 20 రోజులకుపైగా ధరలు దిగొచ్చిన సంగతి తెలిసిందే. గరిష్ఠాల నుంచి రూ. 30 వేలకుపైగానే పతనం అయ్యాయి. దీంతో భౌతికంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఊరట లభించగా.. పెట్టుబడిదారులు మాత్రం నిరాశ చెందారు. ఇక్కడ ప్రధానంగా క్రూడాయిల్ ధరలు వరుసగా పెరుగుతూ పోతుండటం వల్ల ద్రవ్యోల్బణం పెరగడంతో.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. దీంతో డాలర్ పుంజుకొని.. బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణ కోల్పోయేలా చేసింది. దీంతో ధరలు దిగొచ్చాయి. ఇక . దీంతో రేట్లు మళ్లీ పెరుగుతూ వెళ్తున్నాయి. సాధారణంగానే అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా జనం.. బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ క్రూడాయిల్ రేట్లు పెరగడంతో ఇటీవల ఈ పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ క్రూడాయిల్ రేటు ఒక స్థాయికి చేరి స్థిరంగా ఉన్న నేపథ్యంలో.. మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే రాత్రికి రాత్రే భారీ స్థాయిలో పెరిగాయి. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,450 డాలర్ల స్థాయిలో ఉండేది కాస్తా ఇప్పుడు 4600 డాలర్ల మార్కు దాటేసింది. అంటే రాత్రికి రాత్రే 150 డాలర్లకుపైగా పెరిగిందని చెప్పొచ్చు. సిల్వర్ రేటు కూడా 68 డాలర్ల స్థాయి నుంచి 73 డాలర్ల మార్కుకు చేరింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ. 94.61 వద్ద ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా మార్చి 31 ఉదయం 10 గంటల తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా మార్చి 31 ఉదయం 7.30 గంటల సమయంలో హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర స్వల్పంగా రూ. 150 పెరగడంతో తులం రూ. 1,35,900 వద్ద ఉంది. మార్చి 28న రూ. 2300, రూ. మార్చి 27న రూ. 950 ఇలా వరుసగా ధర పెరుగుతూ వచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ. 170 పెరిగి రూ. 1,48,260 వద్ద ట్రేడవుతోంది. ఇదిలా ఉండగా.. వెండి ధర మళ్లీ రూ. 5 వేలు పెరగ్గా.. కేజీకి హైదరాబాద్ మార్కెట్లో ఇప్పుడు రూ. 2.55 లక్షలుగా ఉంది.