Income Tax Changes: సాధారణంగా ప్రతి నెలలోనూ కొత్త కొత్త రూల్స్ వస్తుంటాయి. చాలా వరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇలా అన్నీ ఒకటో తేదీ నుంచే కొత్త మార్పుల్ని ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు ఇంకా మార్చితో ఆర్థిక సంవత్సరమే మారుతున్న క్రమంలో.. ఇంకా చాలానే ఆర్థిక మార్పులు రాబోతున్నాయి. 2026, ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. టాక్స్ పేయర్లు సహా బ్యాంక్ కస్టమర్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారు, డిజిటల్ పేమెంట్ యూజర్లు, వాహనదారులు ఇలా అందరిపై ఇవి ప్రభావం చూపిస్తుంటాయి. మరి కొత్త ఆర్థిక సంవత్సరంలో రానున్న కొత్త మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. >> అప్‌డేటెడ్ ఐటీ రిటర్న్స్- ఇది గతంలో ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్‌కు సంబంధించి.. అందులో తప్పుల్ని సరిదిద్దుకునేందుకు లేదా మర్చిపోయిన ఆదాయాన్ని రిపోర్ట్ చేసి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. సాధారణంగా అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన రెండేళ్లలోపు ఐటీఆర్- యూ ఫైల్ చేయొచ్చు. ఇక్కడ అడిషనల్ టాక్స్, పెనాల్టీ వంటివి పడతాయి. ఏప్రిల్ 1 నుంచే దీనిని దాఖలు చేయొచ్చు.>> పాన్ కార్డ్- 2026, మార్చి 31 వరకు పాన్ కార్డు అప్లై చేసేందుకు గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది. ఇప్పుడు . ఇంకా అదనపు డాక్యుమెంట్స్ కావాల్సిందే. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ, పదో తరగతి మెమో వంటివి అవసరం పడొచ్చు. >> ఎస్బీఐ క్రెడిట్ కార్డు- . రివార్డ్స్ పాయింట్స్ రిడెంప్షన్ పాలసీలో మార్పులు చేసింది. రిడీమ్ చేసుకునే విధానంలో మార్పుల్ని చేసింది. నెలకు గరిష్ఠంగా 60 వేల పాయింట్ల పరిమితి విధించింది. ఇంకా కొన్ని రకాల కార్డుల్లో క్యాష్‌బ్యాక్ ప్రయోజనాల్లో కూడా కోతలు విధించింది. ఇది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది. >> హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- ఈ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ కూడా కీలక మార్పుల్ని ప్రకటించింది. ఇక్కడ ఇప్పటికో లోన్ వడ్డీ రేట్లు తగ్గించి.. . ఇవి ప్రాంతాల్ని బట్టి.. లాకర్ సైజును బట్టి మారుతుంటాయి. ఇంకా యూపీఐ ద్వారా ఏటీఎం క్యాష్ విత్‌డ్రాకు సంబంధించి కూడా పరిమితుల్ని విధించింది. పరిమితి దాటితే పెనాల్టీ పడుతుందని పేర్కొంది. వీటిల్లో కొన్ని ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. >> - నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరల్ని సవరించింది. 2026, ఏప్రిల్ 1 నుంచి ధర పెరగనుంది. . >> రూపే డెబిట్ కార్డు- రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు హోల్డర్స్ ఇక మీదట ఈ ఒక్క కార్డుతోనే.. ఎయిర్‌పోర్ట్, ట్రైన్ లాంజ్‌ల్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. లాంజ్ యాక్సెస్‌కు అనుమతి ఉన్నా.. ఇక్కడ స్పెండింగ్స్‌తో ముడిపెట్టింది. నిర్ణీత మొత్తం ఖర్చుపెడితేనే లాంజ్ యాక్సెస్ కల్పిస్తోంది. >> ఏటీఎం ఛార్జీలు- పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటివి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్ పాలసీల్లో మార్పుల్ని ప్రకటించాయి. ఇక్కడ ఫీజులు, ఆంక్షలు, పరిమితులు వంటివి ఉన్నాయి. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తున్నాయి. >> 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్- భారతదేశంలో అన్ని డిజిటల్ చెల్లింపు లావాదేవీలు.. స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచే దీనిని పాటించాలని పేర్కొంది.వీటితో పాటు ఏప్రిల్ నెలలో ఒకటో తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఏటీఎఫ్, పీఎన్‌జీ, సీఎన్‌జీ ధరలు మారొచ్చు. ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐటీఆర్ ఫైలింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్రం ఐటీఆర్ ఫారమ్స్ నోటిఫై చేసింది. ఏప్రిల్ 1 నుంచే కొత్త ఆదాయపు పన్ను చట్టం కూడా అమల్లోకి రానుంది.