‘సివిల్స్ అధికారులు అప్‌గ్రేడ్ అయ్యారు.. లంచం తీసుకోవడం ఔట్‌డేటెడ్’.. బాలలత షాకింగ్ కామెంట్స్

Wait 5 sec.

సివిల్స్ సాధించడం అనేది ఎంతో మంది యువతీ యువకుల కల. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అత్యున్నత ఉద్యోగాలు సాధించడం కోసం ఎంతో మంది ఏళ్లపాటు శ్రమిస్తారు. దేశానికి సేవ చేయాలనే తపనతోనే వీరంతా సివిల్స్ రాస్తుంటారు. కానీ సివిల్స్‌‌లో ఉత్తీర్ణులై, మంచి పోస్టింగ్ వచ్చిన తర్వాత మాత్రం కొందరు ఆఫీసర్లు వ్యవస్థలోని ఒత్తిళ్లకు తల వంచుతారు. దీనికి కారణాలేంటో చెప్పారు . రెండుసార్లు సివిల్స్ సాధించి, ఆలిండియా అధికారిగా పని చేసి.. ప్రస్తుతం సివిల్స్ అభ్యర్థులకు సలహాలు, కోచింగ్ ఇస్తున్న ఆమె.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘నదులు వెళ్లి సముద్రాల్లో కలుస్తాయి. ఎంత మంచి ఆఫీసరైనా వెళ్లి కరప్షన్లో భాగం అవుతారు. దానికి ప్రధాన కారణం.. సివిల్స్ రిజల్ట్స్ వచ్చిన పావు గంటకు ఏ కులం నుంచి ఎవరికి వచ్చిందని చెప్పి పెళ్లి సంబంధాలు వస్తాయి. రిచ్చెస్ట్ మామలు వస్తారు. అక్కడి నుంచి వేలం స్టార్ట్ అవుతుంది. రూ.100 కోట్లు, రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు ఇలా కట్నం ఇచ్చిన అమ్మాయిలకు.. ఎక్స్‌పెక్టెషన్ కూడా అలాగే ఉంటుంది. అయితే వీళ్లకు వచ్చే జీతం పది రోజులకు కూడా సరిపోదు. సివిల్స్ ప్రిపేరయ్యే ప్రతి ఒక్కరు ఎథిక్స్, చరిత్ర, రాజకీయ వ్యవస్థ లాంటివి చదువుతారు. ముస్సోరీలోని అకాడమీలో ఆఫీసర్లు ఎలా బిహేవ్ చేయాలి, ఎలాంటి విలువలు పాటించాలనే విషయాలెన్నో నేర్పిస్తారు’’ అని బాలలత మేడం తెలిపారు.‘‘నిజాయితీగా ఉండే ఆలిండియా అధికారులు కూడా ఉన్నారు. నేను సివిల్ సర్వెంట్‌గా జాబ్ చేశాను. ఫోన్లు ఎత్తకపోతే.. ఐఏఎస్ అయ్యారు కాబట్టి ఎత్తడం లేదంటారు. ఎత్తితేనేమో అడగకూడని ఫేవర్లు అడుగుతారు. ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్, ప్రధానంగా అబ్బాయిలకు అత్తామామల ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనసులో ఏదో మూల తప్పు చేస్తున్నాం అని ఉంటుంది. కానీ చేయక తప్పదు’’ అని బాలలత వ్యాఖ్యానించారు.‘‘కరప్షన్లో 40, 50 రకాలు ఉన్నాయి. డబ్బులు తీసుకోవడం అనేది చాలా ఔట్ డేటెడ్ వ్యవహారం. చాలా కొత్త విధానాలొచ్చాయి. నేను ఉద్యోగం చేసేటప్పుడు మా బాస్ కూతురి పెళ్లయ్యింది. మొత్తం అరేంజ్‌మెంట్స్ వేరే వాళ్లు ఎవరో చేశారు. బంగారం కొనడం దగ్గర్నుంచి ఫంక్షన్ హాల్ బుకింగ్ చేయడం వరకు మొత్తం ఖర్చు వేరే వాళ్లు భరించారు. మా బాస్ పెళ్లికి జస్ట్ గెస్ట్‌లా వచ్చాడు. సివిల్ సర్వీసెస్‌లో డబ్బులెవరూ క్యారీ చేయరు, తీసుకోరు కూడా, చాలా అప్‌గ్రేడ్ అయ్యారు. అవినీతి జరిగినట్టు ఎక్కడా కూడా అర్థం కాదు’’ అని బాలలత చెప్పుకొచ్చారు.‘‘సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం రాజకీయ నాయకుల ముందు జీ హుజూర్ అన్నట్టు ప్రవర్తించడానికి, రాజకీయాల్లోకి రావడానికి కారణం.. పొలిటిషియన్స్ ఎంజాయ్ చేసే పవర్‌ను చూడటమే. నాలుక మీద వేసిన తేనె చుక్కను రుచి చూడకుండా ఎలా ఉండలేమో.. అధికారాన్ని ఎంజాయ్ చేయకుండా అలాగే ఉండలేం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వెళ్లి గవర్నర్ అయ్యారు. చాలా మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాజకీయాల్లోకి వెళ్తున్నారు. సామాన్యుడు రాజకీయాల్లోకి రావడానికి ఎంతో కృషి చేయాలి. అందుకే పవర్ కోసం షార్ట్‌కట్‌లు వెతుక్కుంటున్నారు. దీని వల్లే సమాజంలో బ్యూరోక్రాట్లకు గౌరవం తగ్గిపోతోంది’’ అని బాలలత వ్యాఖ్యానించారు.