కేబుల్ బిల్లు ఫ్రీ, టీవీ ఛానల్స్ ఉచితంగా చూడొచ్చు.. టీడీపీ ఎమ్మెల్యేకు పోటీగా టీడీపీ సీనియర్ నేత బంపరాఫర్

Wait 5 sec.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీలో కేబుల్ వార్ నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే , టీడీపీ సీనియర్ నేత మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే దౌర్జన్యంగా, దుర్మార్గంగా, కక్షపూరితంగా తమ కేబుల్ కనెక్షన్‌ను తొలగించాలనరి చూస్తున్నారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అఖిలప్రియ దోపిడీ దొంగల కంటే హీనంగా ఉన్నారని.. ఆమెకు దమ్ముంటే ప్రజలకు ఉచితంగా కేబుల్ కనెక్షన్ అందించాలన్నారు. అంతేకానీ ఇలా దోపిడీ దొంగలు లాగా వ్యవహరించడం తగదన్నారు. ఒకరి ఆస్తులపై దౌర్జన్యం ఎందుకని ప్రశ్నించారు.. తాను రూ.270 కేబుల్ కనెక్షన్లు ఇస్తున్నానని.. వారికి దమ్ముంటే రూ.200కు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే అంటే రాజు కాదని.. ఎంత మౌనంగా ఉంటే అంత రెచ్చగొడుతున్నారన్నారు.. ఇంతటితో ఇది ఆగదన్నారు.ఎమ్మెల్యే అఖిలప్రియపై కోపంతో ఏవీ సుబ్బారెడ్డి బంపరాఫర్ ప్రకటించారు.. ఆళ్లగడ్డలో కొత్త కనెక్షన్లతో సహా అన్ని ఫ్రీ అంటూ ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి ఫ్రీ కేబుల్ అమల్లోకి వస్తుందని కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డికి సంబంధించిన సిటీ కేబుల్ కనెక్షన్లు దాదాపు 2000 పైగా ఉన్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలియజేశారు. ఈ మేరకు ఏవీ సుబ్బారెడ్డి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు. 'ఆళ్లగడ్డలో పరిణామాల దృష్ట్యా ఆళ్లగడ్డ GTPL వినియోగదారులకు తెలియజేయడం ఏమనగా ఏప్రిల్ 1వ తారీకు నుంచి డిష్ బిల్లు ఉచితంగా ఇవ్వబడును. కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచl. గత 20 ఏళ్లుగా ఆదరిస్తున్న కస్టమర్‌లకు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. నంద్యాల సిటీ కేబుల్ పేరుతో ఇతరులు, కొత్తవారు ఎవరైనా ఇంటి వద్దకు వచ్చి పాత సెటప్ బాక్స్ తీసుకుని కొత్త సెటప్ బాక్స్‌ బిగిస్తాం అని వస్తే తక్షణమే వారిని తిరస్కరించాలr. అలాగే ఇంటి దగ్గరకు ఎప్పుడు వచ్చే లైన్‌మెన్‌కు కానీ.. 8106786002 నంబర్‌కు, మేనేజర్ మొబైల్ నంబర్లకు తెలియజేయాలి' అని ఓ ప్రకటనను విడుదల చేశారు. భూమా కుటుంబం, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాలు ఒకప్పుడు కలిసి ఉండేవి.. దివంగత భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు స్నేహితులు. నాగిరెడ్డి మరణం తర్వాత నుంచి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వార్ నడుస్తోంది.. రెండు వర్గాల మధ్య పలు సందర్భాల్లో గొడవలు జరిగాయి. భూమా అఖిలప్రియ తనపై కుట్ర చేసిందని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. టీడీపీ అధిష్టానం ఇరువర్గాలను పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి కేబుల్ వార్ మొదలైంది.