భారీగా పెరిగి ఇప్పుడు స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే?

Wait 5 sec.

: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. పండగలు, వివాహాలు ఇతర శుభకార్యాల సమయంలో ఎక్కువగా ధరిస్తుంటారు. దీంతో సాధారణంగానే ఈ సమయాల్లో డిమాండ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్‌లో.. ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా.. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం భయాలు పెరిగాయి. ఇదే సమయంలో యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడం.. బంగారం డిమాండ్‌ను తగ్గించింది. దీంతో ధరలు భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఏమైందో ఏమో గానీ.. .. రేట్లు ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి. ఆదివారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు సోమవారం సెషన్‌లోనూ ఉదయం 7 గంటల సమయంలో ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఒకవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. బ్యారెల్‌కు ప్రస్తుతం 116 డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రభావం బంగారం ధరలపై ఇవాళ ఇంట్రాడేలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు చూస్తే ఔన్సుకు 4470 డాలర్ల స్థాయిలో ఉంది. కిందటి రోజుతో పోలిస్తే ఇది స్వల్పంగా దిగొచ్చింది. సిల్వర్ రేటు 69 డాలర్ల మార్కు దిగువకు చేరింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 94.82 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులం రూ. 1,35,750 వద్ద ఉంది. మార్చి 27న రూ. 950 పెరగ్గా.. మార్చి 28న రూ. 2300 చొప్పున ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు హైదరాబాద్ నగరంలో రూ. 1,48,090 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కేజీకి సరిగ్గా రూ. 2.50 లక్షల వద్ద ఉంది. ఇది మార్చి 27న రూ. 15 వేలు పడిపోగా.. 28న రూ. 5 వేల మేర పెరిగింది. ఇప్పుడు క్రూడాయిల్ ధర మళ్లీ పడిపోతే.. బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.