తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాల్లో పోటీచేస్తోన్న డీఎంకే.. ఒకే విడతలో మొత్తం అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి, అధినేత కొలతూర్ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెపాక్-ట్రిప్లికేన్ నుంచి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బోడినాయక్కనూర్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కోయంబత్తూరు సౌత్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే, 60 మంది కొత్తవారికి సీట్లను కేటాయించిన స్టాలిన్.. పలువురు మంత్రులను పక్కనబెట్టారు. ప్రస్తుతం పోటీచేస్తున్న 164 మందిలో 125 మంది గ్రాడ్యుయేట్లు. వీరిలో 15 మంది డాక్టర్లు, 17 మంది ఇంజినీర్లు, 29 మంది లాయర్లు, ఏడుగురు పీహెచ్‌డీలు చేసివారు ఉన్నారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో 164 సీట్లలో డీఎంకే, మిగతా 70 స్థానాల్లో కాంగ్రెస్ వీసీకే, వామపక్షాలు పోటీ చేయనున్నాయి. డీఎంకే సారథ్యంలోని సెక్యూలర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (ఎస్‌పీఏ)లోని కాంగ్రెస్ పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవాంకోడె, శివకాశి, కారైకుడి సహా 28 చోట్ల పోటీ చేయనుంది. వాస్తవానికి డీఎంకే 175 సీట్లలో పోటీ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో మిత్రపక్షాలకు అదనపు సీట్లను కేటాయించింది. తొలుత మిత్రపక్షాలకు 68 సీట్లను కేటాయించిన స్టాలిన్.. మరో రెండు పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు. తమిళర్‌ దేశం కట్చి (టీడీకే), మనిదనేయ జననాయగ కట్చిలకూ చెరో సీటు ఇచ్చారు. ముక్కులత్తోర్‌ పులిపడై, ఎస్డీపీఐలకు ఒక్కో సీటు దక్కింది. ఈ పార్టీలన్నీ డీఎంకే గుర్తు ఉదయించే సూర్యుడిపై పోటీ చేయనున్నాయి. దీంతో డీఎంకే ప్రత్యక్షంగా పోటీ చేసే సీట్ల సంఖ్య 164కి తగ్గింది. ఇక, ప్రకటించింది.ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీలకు కేటాయించినవి పోనూ 169 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుంది. ఇటీవల 23 మందితో తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. 127 మందితో రెండో జాబితాను విడుదల చేయగా.. 20 మంది సిట్టింగ్‌‌లను పక్కనబెట్టింది. వీరి స్థానంలో 20 మంది మాజీ మంత్రుల పేర్లు వచ్చాయి. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ఒకే దశలో ఏప్రిల్ 23న జరుగనుంది. మే 4న ఓట్లను లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.