‘నరకానికి స్వాగతం.. ఇక్కడకు వస్తే శవపేటికలోనే తిరిగి వెళ్తారు’ అమెరికా సైనికులకు ఇరాన్ వార్నింగ్

Wait 5 sec.

యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేస్తున్నా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. యుద్ధం మహోగ్రరూపం దాల్చుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌ పత్రిక ‘నరకానికి స్వాగతం’ అనే శీర్షికతో మొదటి పేజీలో శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. ‘తమ భూభాగంపై అమెరికా సైనికులు అడుగుపెడితే శవపేటికల్లోనే తిరిగి వెళ్తారు’ అని హెచ్చరించింది. పంపే అవకాశాలను పరిశీలిస్తుందని, భూతుల దాడులకు ప్లాన్ చేస్తుందనే నివేదికల నేపథ్యంలో ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఈ చర్యఊహాగానాలకు ఆజ్యం పోసింది. సంఘర్షణను ముగించే లక్ష్యంతో అమెరికాతో శాంతి చర్చలలో ఇరాన్ నిమగ్నమై ఉందని డొనాల్డ్ ట్రంప్ పదేపదే నొక్కి చెబుతున్నప్పటికీ, ఈ మోహరింపు ఆ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని గణనీయంగా పెంచుతుంది. అదనపు బలగాల తరలింపు నివేదికలే నిజమైతే పశ్చిమాసియాలో అమెరికా బలగాల ఉనికి గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే ఉద్రిక్తతంగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయనే ఆందోళన నెలకుంది.వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంలో మరిన్ని సైనిక ప్రత్యామ్నాయాలు అందించడమే ఈ అదనపు దళాల ఉద్దేశం. ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న వేలాది మంది పారాట్రూపర్లు, మెరైన్‌లతో ఈ బలగాలు కలుస్తాయి. తమపై ప్రారంభిస్తే.. యెమెన్‌లోని తమ మిత్రపక్షం హౌతీలు రంగంలోకి దిగుతారని ఇరాన్ అధికారి తెలిపారు. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులను పునఃప్రారంభించాలని వారికి ఆదేశాలు జారీ చేశామని, దీంతో యుద్ధం కొత్త మలుపు తీసుకుంటుందని ఆ అధికారి అభివర్ణించారు.ట్రంప్ మాత్రం ఇరాన్‌పై భూతల దాడులు జరిపే ఉద్దేశం తమకు లేదని పదే పదే చెబుతున్నారు. అంతేకాదు, ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇక, అదనపు సైనిక బలగాలను ఎక్కడ మోహరిస్తారనేది స్పష్టత లేదు. కానీ, ఇరాన్‌‌కు చెందిన ముఖ్యమైన చమురు క్షేత్రం ఖర్గ్ దీవి సమీపానికి ఇవి చేరుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్‌ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను మరో పది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్క్షేత్రస్థాయిలో, టెహ్రాన్ నగర నడిబొడ్డున తాము "ఇరాన్ ఉగ్రవాద పాలన"గా పేర్కొంటున్న సంస్థకు చెందిన మౌలిక సదుపాయాలపై భారీ ఎత్తున దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెల్లవారుజామున ప్రకటించింది. అదే రోజు తరువాత, హిజ్బుల్లా ఉపయోగించే మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నామని చెబుతూ, ఇజ్రాయెల్ సైన్యం బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపై తన దాడులను పునఃప్రారంభించింది. దీనికి ఇరాన్ మద్దతు ఉన్న లెబనీస్ సంస్థ స్పందిస్తూ, దక్షిణ లెబనాన్‌లో తమ బలగాలు ఇజ్రాయెల్ సైనికులతో నేరుగా ఘర్షణ పడ్డాయని పేర్కొంది.