'ఓఆర్ఎస్' వివాదంలో పిల్లల డాక్టర్‌కు నోటీసులు.. ఫార్మా కంపెనీల తీరుపై మెడికల్ అసోసియేషన్లు ఆగ్రహం

Wait 5 sec.

(ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్) లేబులింగ్ లోపాలపై పోరాటం చేసి విజయం సాధించిన హైదరాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు సంతోష్‌కు ఫార్మా కంపెనీలు లీగల్ నోటీసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. సంస్కరణలు ఉండాలని, ప్రజారోగ్యం దృష్ట్యా తప్పుదోవ పట్టించే ఉత్పత్తులపై ఆమె చేసిన సోషల్ మీడియా అవగాహన కార్యక్రమాలపై ఆగ్రహించిన కొన్ని ఫార్మా సంస్థలు ఈ నోటీసులు పంపగా.. ఈ చర్యను డాక్టర్ల వృత్తిపరమైన స్వేచ్ఛను హరించడమేనని వైద్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డాక్టర్ శివరంజని లేవనెత్తిన అంశాలు పూర్తిగా రోగుల భద్రత, శిశువుల ఆరోగ్యానికి సంబంధించినవని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ () పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన ఓఆర్ఎస్‌కు బదులుగా.. కేవలం గ్లూకోజ్ కలిపిన ఉత్పత్తులను ప్రజలకు విక్రయించడం వల్ల అనర్థాలు జరుగుతాయని హెచ్చరించటం ఒక వైద్యురాలిగా ఆమె బాధ్యత అని ఫైమా స్పష్టం చేసింది. ఇలాంటి నోటీసుల ద్వారా వైద్యులను భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడింది. తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ , జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సైతం ఈ నోటీసులను తీవ్రంగా ఖండించాయి. పేషెంట్ల ఆరోగ్యం కోసం పోరాడే డాక్టర్లను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అసోసియేనష్ ప్రతినిధులు పేర్కొన్నారు. హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఒక డాక్టర్ సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నప్పుడు ఆమెను అడ్డుకోవడం అంటే సమాజ ఆరోగ్యానికి విఘాతం కలిగించడమేనని విమర్శించారు. ఈ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా వైద్య సంఘాలతో సమన్వయం చేసుకుని భారీ ఎత్తున నిరసనలు చేపడతామని అసోసియేషన్ల ప్రతినిధులు హెచ్చరించాయి. వైద్యులపై జరుగుతున్న ఇలాంటి కార్పొరేట్ బెదిరింపులకు వ్యతిరేకంగా న్యాయపరంగా కూడా పోరాడతామని వారు స్పష్టం చేశారు. కాగా, మార్కెట్‌లో లభించే చాలా డ్రింక్స్ ఉండటం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఎస్‌ పేరిట జరుగుతున్న విచ్చలవిడి దందాపై డాక్టర్ శివరంజిని సంతోష్‌ ఎనిమిదేండ్లుగా పోరాడుతున్నారు. ఓఆర్‌ఎస్‌ పేరిట జరుగుతున్న అమ్మకాలపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాకు లేఖ రాశారు. దీంతో మార్కెట్‌లో ఓఆర్‌ఎస్‌ పేరిట సాగిస్తున్న దందాపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఉక్కుపాదం మోపింది. ఇక నుంచి ఆయా బ్రాండ్లు 'ఓఆర్‌ఎస్‌' అనే పదాన్ని తమ ఉత్పత్తులపై ఫ్రింట్ చేయటానికి వీళ్లేదని గతేడాది చివర్లో ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తయారు చేసే తమ ఉత్పత్తులపై 'డబ్ల్యూహెచ్‌వో రికమండ్ చేసిన ఓఆర్‌ఎస్‌ ఫార్ములా' కాదు అని ముద్రించాలని సూచించింది.