బొలిశెట్టి సత్యనారాయణకు పార్టీతో సంబంధం లేదు.. జనసేన కీలక ప్రకటన

Wait 5 sec.

విశాఖపట్నానికి చెందిన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణకు సంబంధించి కీలక ప్రకటన జారీ అయ్యింది. ఇటీవల ఆయన జనసేన పార్టీలో పదవులకు రాజీనామా చేశారు.. తాను హైకోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ విషయంలో జనసేన పార్టీకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సత్యనారాయణ తెలిపారు. అయితే సోషల్ మీడియాలో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. వెంటనే స్పందించిన బొలిశెట్టి తాను పార్టీ పదవులకు మాత్రమే రాజీనామ చేశానని.. పార్టీలోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా బొలిశెట్టి ఎపిసోడ్‌పై జనసేన పార్టీ కూడా స్పందించింది. కు జనసేన పార్టీతో ఎటువంటి అనుబంధం లేదని ప్రకటనలో తెలియజేసింది. ఆయన తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించే నిమిత్తం పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని.. ఈ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ అంగీకరించారన్నారు. చేపట్టే కార్యక్రమాలకీ పార్టీకీ సంబంధం లేదని వివరణ ఇచ్చారు. జనసేన పార్టీ అధికారికంగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. అయితే పార్టీ ప్రకటనపై బొలిశెట్టి సోషల్ మీడియా వేదికగా మరో ప్రకటనను విడుదల చేశారు.'గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి.. పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం రాష్ట్ర మరియు దేశ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలనే నా అభ్యర్థనను మన్నించి, నన్ను పార్టీ బాధ్యతల నుండి విముక్తుడిని చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ పరంగా దూరమైనా, సిద్ధాంతాల పరంగా మన అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మనల్ని కలిపిన, మనం కలిసి పనిచేద్దాం అనుకున్న పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కోసం నేను కోరగానే నన్ను పదవి బాధ్యతల నుంచి విముక్తుడిని చేస్తూ, పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయడానికి మీరు చూపిన చొరవకు కృతజ్ఞతలు. ముఖ్యంగా కొల్లేరు సరస్సు రక్షణ విషయంలో, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ మరియు భూ నిర్వాసితుల సమస్యల విషయంలో మీరు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నందున మరింత చొరవ చూపి ఆ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను' అన్నారు.'అలాగే, పర్యావరణ ప్రభావ అంచనాలు (Environmental Impact Assessment) లేకుండా చిత్తడి నేలలను ఆక్రమించడం, వ్యవసాయ భూముల భూ వినియోగ మార్పిడి (Land Use Conversion) వంటి వాటిని నిరోధించి, ప్రకృతిని కాపాడే విషయంలో మీ వంతు బాధ్యతను మీరు చిత్తశుద్ధితో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగత సిద్ధాంతాలకు మరియు సామాజిక బాధ్యతకు విలువనిస్తూ నా నిర్ణయాన్ని ఆమోదించిన మీ పెద్ద మనసుకి మరొకసారి ధన్యవాదాలు' అంటూ బొలిశెట్టి సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు.