: స్మాల్ క్యాప్ కేటగిరిలోని టెక్స్టైల్ సెక్టార్ కంపెనీ ఆర్ అండ్ బీ డెనిమ్స్ లిమిటెడ్ (R & B Denims Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై జారీ చేయడానికి ఆమోదం తెలుపగా.. రికార్డు డేట్ ఏప్రిల్ 3గా నిర్ణయించినట్లు కంపెనీ తమ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా తెలిపింది. ఏప్రిల్ 3వ తేదీన ఎక్స్-బోనస్ ట్రేడింగ్ చేయనున్నాయి.ఈ బోనస్ ఇష్యూ ప్రకారం 2 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసిన వారికి ఉచితంగా బోనస్ రూపంలో 1 ఈక్విటీ షేరుని పొందుతారు. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత ఆరు నెలల్లో 35 శాతం నష్టాన్ని మిగిల్చింది. ఈ కంపెనీ గత ఏడాది 2025 సెప్టెంబర్ లోన్ స్టాక్ మార్కెట్ల లోకి లిస్ట్ అయింది. లిస్ట్ అయిన ఆరు నెలల్లోనే బోనస్ షేర్లు ఇస్తుండడం గమనార్హం. ఆర్ బీ డెనిమ్స్ లిమిటెడ్ అనేది రూ. 100 లోపు ధర గల ఒక పెన్నీ స్టాక్. ప్రస్తుతం రూ.71 వద్ద ట్రేడవుతోంది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఇటీవలే కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ 1:2 రేషియోలో బోనస్ షేర్లు జారీకి ఆమోదం తెలుపారు. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 2 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసి తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉంటారో అలాంటి వారికి రూ. . అలాగే ఈ బోనస్ షేర్ల జారీ రికార్డు డేట్ ఏప్రిల్ 3, 2026గా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో ఆర్ అండ్ బీ డెనిమ్స్ లిమిటెడ్ షేరు 5 శాతం నష్టంతో రూ. 71.48 ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 203 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 71.48 లుగా ఉంది. ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిని ఈరోజే తాకడం గమనార్హం. గత వారం రోజుల్లో ఈ షేరు 19 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో 60 శాతం పడిపోయింది. గత ఆరు నెలల్లో 35 శాతం నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 643 కోట్లుగా ఉంది.