'నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో'.. రష్మీ కోసం సుధీర్ చెప్పిన డైలాగ్ కావ్య నోట

Wait 5 sec.

బిగ్‌బాస్ 8 తెలుగు విన్నర్ నిఖిల్ మలియక్కల్.. సీరియల్ నటి కావ్యశ్రీ మధ్య బ్రేకప్ అయి దాదాపు రెండేళ్లు అవుతుంది. నెమ్మదిగా ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. మొదట్లో ఫ్యాన్స్ కాస్త హడావిడి చేసినా వాళ్లు కూడా అర్థం చేసుకొని ఇక కామెంట్లలో అడగటం కూడా మానేశారు. అయితే కావ్య ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. వరుస షోలతో ఆడియన్స్‌ని పలకరిస్తుంది.ప్రస్తుతం జీ తెలుగులో వస్తున్న ఆట డ్యాన్స్ షోలో కావ్యశ్రీ మెంటార్‌గా ఉంది. ఈ షోని సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా షోలో కావ్య-సుధీర్ కెమిస్ట్రీ ఆడియన్స్‌ని ఫిదా చేస్తుంది. కావ్యని క్యూట్‌గా ప్రతిసారి సుధీర్ ప్రపోజ్ చేయడం.. ఇక లవ్ సింబల్స్, బీజీలు వేసి ప్రోమోలు వదలడం అన్నీ ఎప్పటిలానే జరుగుతన్నాయి. దీంతో ఈ ఇద్దరి పెయిర్ బావుందంటూ ఆడియన్స్ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.ఇక తాజాగా సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ సీజన్ 6 లేటెస్ట్ ఎపిసోడ్‌కి కూడా కావ్య గెస్టుగా వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో బావుంది. 'హైర హైర హైరబ్బా' పాటకి కావ్యతో సుధీర్ డ్యాన్స్ చేశారు. సర్కార్ హోస్టింగ్ ఎలా చేస్తారో చేయండి.. లైట్‌గా చేసినా చాలు మిగతా టిప్స్ అన్నీ నేను తర్వాత నేను ట్రైన్ చేస్తాను ఇంట్లో.. అంటూ సుధీర్ అంటుంటే కావ్య సిగ్గుపడింది.సుధీర్-కావ్య కెమిస్ట్రీ"మన్మథుడు భూమికొస్తే స్వయానా అవుతాడు సుధీర్ బయానా.." అంటూ సుధీర్‌ని ఇన్వైట్ చేసింది కావ్య. దీనికి అవుతాడు కాదు అయ్యాడు ఆల్‌రెడీ.. మన్మథుడు అన్ని చోట్లా ఉండలేక నన్ను పుట్టించాడు.. అంటూ సుధీర్ తనదైన డైలాగులు కొట్టాడు. ఇక ఈ ఎపిసోడ్‌కి ప్రేరణ, తేజస్విని గౌడ, యాంకర్ నిఖిల్ కూడా వచ్చారు.కావ్య గారు ఒకసారి క్లూ అడగండి.. అని సుధీర్ అనగానే సుధీర్ గారు క్లూ ప్లీజ్.. అని కావ్య క్యూట్‌గా అడిగేసరి హా.. అంటూ సుధీర్ ఫ్లాట్ అయిపోయాడు. ఇక తేజస్వినిని ఇండియాలో ఎన్ని పులులున్నాయని ప్రశ్న అడిగాడు సుధీర్. మీతో కలిపా కలపకుండానా.. అని తేజు అనేసరికి సుధీర్ గాల్లో తేలిపోయాడు. అయితే ఆయన అడిగింది పులి.. పంది కాదు.. అంటూ కావ్య గాలి తీసేసింది.ప్రోమో చివరిలో మీకు బాగా నచ్చిన ఫేమస్ సినిమా డైలాగ్ ఏదైనా చెప్పండి అంటూ సుధీర్ అడిగాడు. నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతాను.. అంటూ అప్పట్లో రష్మీకి సుధీర్ చెప్పిన అదే డైలాగ్‌ని కావ్య చెప్పి షాకిచ్చింది. ఇలా సుధీర్-కావ్య మధ్య కెమిస్ట్రీ మాత్రం మాములుగా లేదు. మీరు ఇంత హార్ష్‌గా మాట్లాడాలా హార్ట్ హర్ట్ అయిపోయేలా.. అంటూ సుధీర్‌తో కావ్య చెప్పిన డైలాగ్ భలే క్యూట్‌గా ఉంది.