ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఆర్డీటీకి గ్రీన్‌‌సిగ్నల్, FCRI రెన్యువల్‌‌పై ఆదేశాలు

Wait 5 sec.

తెలుగు రాష్ట్రాలకు, అనంతపురం జిల్లావాసులకు కేంద్రం నుంచి తీపికబురు అందింది. (రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌) సేవలకు అనుమతి వచ్చింది. ఆర్డీటీ విదేశీ నిధులు పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆర్డీటీ విదేశీ నిధులు వినియోగించుకునేందుకు వీలుగా.. ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేసినట్లు ఆర్డీటీ ప్రతినిధులకు కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం ఇచ్చింది. ఆర్డీటీకి లైన్ క్లియర్ అయ్యిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తెలిపారు. ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ అనంతపురం జిల్లాతో పాటుగా పలు ప్రాంతాల్లో విద్య, వైద్యం, స్వయం ఉపాధి వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆర్డీటీకి విదేశాల నుంచి నిధులు వస్తుంటాయి.. అయితే ఈ నిధుల వినియోగానికి అనుమతుల్ని కేంద్రం నిలిపివేసింది. ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (FCRI) కింద కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి ఆర్డీటీకి సంబంధించి ఫారిన్ కాంట్రిబ్యూషన్ అకౌంట్‌లలో ఉన్న డబ్బుల్ని వినియోగించడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆర్డీటీ సేవా కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. ఏపీ ప్రభుత్వం ఆర్డీటీకి సంబంధించిన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు వినతిపత్రాలు సమర్పించారు. కేంద్రం సానుకూలంగా స్పందించి.. ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేసింది. దీంతో ఆర్డీటీ సేవా కార్యక్రమాలను త్వరలోనే మళ్లీ ప్రారంభించనుంది.ఆర్డీటీ విదేశీ నిధుల విషయంలో సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్డీటీ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఎన్నో సేవలు అందిస్తోందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్డీటీకి విదేశాల నుంచి వస్తున్న నిధుల వినియోగించేందుకు అంతరాయం కలిగిందని.. ఆర్డీటీ అందించే సేవల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించామన్నారు. ఆయన స్పందించి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి విన్నవించగానే సానుకూలంగా స్పందించిన కేంద్రానికి.. ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందుతున్న లక్షలాది మంది పేద ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. యథావిధిగా కొనసాగుతాయన్నారు మంత్రి లోకేష్. ' తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. లక్షలాది మంది సంతోషించే సమాచారం. పేద ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ గారికి, హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దశాబ్దాల సేవాస్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు' తెలుపుతూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.