జొమాటో బాటలోనే స్విగ్గీ సడెన్ షాక్.. ప్లాట్‌ఫాం ఫీజు పెంపు.. రోజూ అదనంగా రూ. 50 లక్షల లాభం!

Wait 5 sec.

: బయట ఫుడ్ తినడం మీకు ఇష్టమా..? ఇందుకోసం ఎక్కువగా మీరు ఆన్‌లైన్ డెలివరీలపై ఆధారపడతారా.. అయితే ఇది మీకోసమే. మీ పుడ్ డెలివరీ ఖర్చులు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో వంటి .. ఇందులోనే ఒకటి ప్లాట్‌ఫాం ఫీజు. దీనిని ప్రారంభంలో రూ. 2 నుంచే తీసుకొచ్చినా వీలుచిక్కినప్పుడల్లా పెంచేస్తూనే ఉన్నాయి. భారీగా పెరిగి ఇటీవల రూ. 15 దాటింది. . ఈ క్రమంలోనే తాజాగా స్విగ్గీ కూడా షాకింగ్ ప్రకటన చేసింది. ప్లాట్‌ఫాం ఫీజును ఒక్కో ఆర్డర్‌పై జీఎస్టీతో కలిపి సుమారు రూ. 2.59 మేర పెంచింది. దీంతో ఇప్పుడు మొత్తం ప్లాట్‌ఫాం ఫీజు రూ. 14.99 నుంచి రూ. 17.58 కి చేరింది. ఇటీవల జొమాటో ప్లాట్‌ఫాం ఫీజును ఒక్కో ఆర్డర్‌పై గతంలో రూ. 12.5 గా ఉండగా.. దీనిని రూ. 14.9 కి చేర్చింది. ఇది సుమారు 19.2 శాతం మేర పెరిగింది. ఇప్పుడు స్విగ్గీ చూస్తే సుమారు 17 శాతం మేర పెంచినట్లు తెలుస్తోంది. అంతకుముందు 2025, ఆగస్టులో కూడా స్విగ్గీ ప్లాట్‌ఫాం ఫీజును రూ. 12 నుంచి రూ. 14 కు పెంచింది.ఈ ప్లాట్‌ఫాం ఫీజు అనేది నేరుగా కంపెనీలకే వెళ్తుందని చెప్పొచ్చు. ఇది పూర్తిగా అదనపు ఆదాయంగానే చెప్పొచ్చు. ఇక్కడ రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, జీఎస్టీ, డెలివరీ రుసుములు, హ్యాండ్లింగ్ ఛార్జీలకు అదనంగా ఉంటుంది. మీరు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు జీఎస్టీ అండ్ అదర్ ఛార్జెస్‌లో.. ఈ ప్లాట్‌ఫాం ఫీజు గమనించొచ్చు. రోజురోజుకూ ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో.. లాభదాయకత పెంచుకునేందుకు ఆయా సంస్థలు ఇలా కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. ప్లాట్‌ఫాం ఫీజు తొలుత 2023లో తొలిసారి స్విగ్గీ ప్రవేశపెట్టగా ప్రారంభంలో కనీసం రూ. 2 గానే ఉంది. తర్వాత వీలుచిక్కినప్పుడల్లా.. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో దీనిని పెంచుతూ పోయింది. ఇటీవల రూ. 15 వరకు చేర్చగా.. ఇప్పుడు అది స్విగ్గీలో రూ. 17.58 అయింది. ఇప్పుడు ఒక్కో ఆర్డర్‌పై స్విగ్గీ పెంచిన ప్లాట్‌ఫాం ఫీజు రూ. 2.59 అనేది ఒక్కొక్కరికి చూస్తే తక్కువగానే అనిపించొచ్చు.. కానీ రోజుకు సగటున స్విగ్గీ 20 లక్షలకుపైగా ఆర్డర్లు డెలివరీ చేస్తుంది. దీంతో కేవలం పెంచిన రూ. 2.59 తోనే ప్రతిరోజూ ఈ ప్లాట్‌ఫాం ఫీజు ద్వారానే అదనంగా రూ. 51 లక్షలకుపైగా సంపాదిస్తుంది. ఇక 20 లక్షల ఆర్డర్ల లెక్కన చూస్తే.. మొత్తం ప్లాట్‌ఫాం ఫీజు రూ. 17.58 తోనే రోజుకు రూ. 3.51 కోట్ల వరకు ఆర్జిస్తుండటం విశేషం.