: భారత్‌లో రైలు ప్రయాణాలకు ఫుల్ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దూర ప్రాంతాలకు కుటుంబంతో కలిసి వెళ్లాలన్నా.. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలన్నా.. తీర్థయాత్రలకు వెళ్లాలన్నా ఎక్కువగా మొగ్గుచూపేది రైలు ప్రయాణాలకే అని చెప్పొచ్చు. ఇక్కడ ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే.. కాస్త కంఫర్ట్‌గా ప్రయాణం చేయొచ్చు. ఇంకా టికెట్ ధర కూడా ఇతర రవాణా సాధనాలు ఫ్లైట్, బస్సు, కార్లు వంటి వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి భారతీయ రైల్వే.. ఛార్జీలు, రిఫండ్ నిబంధనల్లో కీలక మార్పుల్ని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ విధానాన్ని సవరించింది. గతేడాది . ఇప్పుడు క్యాన్సిలేషన్, రిఫండ్‌కు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ట్రైన్ టికెట్లకు సంబంధించి అక్రమ విక్రయాల్ని అరికట్టేందుకు.. అలాగే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా ఈ కొత్త నిర్ణయాల్ని తీసుకున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇక్కడ కొత్త రూల్స్ ప్రకారం.. ప్రయాణ సమయానికి అంటే రైలు బయల్దేరే సమయానికి ఎంత ముందుగా టికెట్ క్యాన్సిల్ చేశారనే దానిపై ఆధారపడి ఛార్జీలు, రిఫండ్ వర్తిస్తాయి. ఈ సవరించిన నిబంధనల్ని ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశలవారీగా అమలు చేయనున్నట్లు పేర్కొంది రైల్వే శాఖ. సవరించిన విధానం ప్రకారం.. రైలు బయల్దేరనున్న 72 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ కనీస క్యాన్సిలేషన్ రుసుము మాత్రమే కోత విధిస్తారు. మిగతా మొత్తం రిఫండ్ పొందొచ్చు. దీనిని మ్యాగ్జిమమ్ రిఫండ్‌గా పేర్కొంటారు. ఇక రైలు బయల్దేరే 72 గంటల నుంచి 24 గంటల్లోపు చూస్తే ఇక్కడ ట్రైన్ టికెట్ ఛార్జీలో 25 శాతం కోత విధించి.. మిగతాది రిఫండ్ ఇస్తుంది. ఇదే విధంగా ట్రైన్ బయల్దేరనున్న 24 గంటల నుంచి 8 గంటల్లోపు అయితే లేట్ క్యాన్సిలేషన్ కింద 50 శాతం వరకు క్యాన్సిలేషన్ ఛార్జీ విధిస్తారు. రైరైలు బయల్దేరాల్సిన 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే క్లోజ్డ్ విండో కింద పరిగణించి ఇక్కడ రిఫండ్ ఏమీ ఇవ్వరు.ఇక్కడ భారతీయ రైల్వే మరో శుభవార్త కూడా చెప్పింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం.. రైలు బయల్దేరడానికి 30 నిమిషాల ముందు వరకు .. తమ బోర్డింగ్ పాయింట్/స్టేషన్ మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఇక్కడ సిటీల్లో ఉండే వారు వారికి వీలు పడ్డ స్టాప్‌లో ఎక్కేందుకు ఇది వీలు కల్పిస్తోంది. ఇప్పటి వరకు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవడం అనేది.. చార్ట్ ప్రిపేర్ చేయకముందు వరకే అనుమతి ఉండేది. త్వరలో మరో పెద్ద మార్పు కూడా తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా కన్ఫర్మ్ అయిన ట్రైన్ టికెట్లను క్యాన్సిలేషన్ రుసుములు లేకుండానే రీషెడ్యూల్ (తేదీ మార్చుకోవడం) చేసుకునే కొత్త ఫీచర్‌ను త్వరలో రైల్వే శాఖ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.