క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Wait 5 sec.

: మత మార్పిడి, రిజర్వేషన్ల అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. హిందూ మతాన్ని వీడి క్రైస్తవ మతంలోకి మారి.. ఆ మత ఆచారాలను పాటించే వ్యక్తి షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను పొందేలేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎస్సీ హోదా అనేది కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితమని ధర్మాసనం తేల్చి చెప్పింది.హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితం..జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజరియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులను ప్రస్తావించింది. ఆ ఉత్తర్వుల్లోని 3వ నిబంధన ప్రకారం.. పేర్కొన్న మూడు మతాలు తప్ప ఇతర మతాల్లోకి మారిన వ్యక్తి పుట్టుకతో ఎస్సీ అయినప్పటికీ.. ఆ హోదాను తక్షణమే కోల్పోతారని కోర్టు వివరించింది. "ఇందులో ఎలాంటి సందిగ్ధత లేదు. మతం మారిన వ్యక్తికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలు, ఎలాంటి ప్రయోజనాలు వర్తించవు" అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.పాస్టర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై వివాదంఆంధ్ర ప్రదేశ్‌ బాపట్ల జిల్లాలోని పిట్టలవాని పాలెం గ్రామానికి చెందిన ఓ ఎస్సీ వ్యక్తి హిందూ మతాన్ని వీడి.. క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆపై పాస్టర్‌గా మారి ఓ చర్చిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే కొంత కాలం క్రితం ఆయన తనపై కొందరు దాడి చేశారని, కులం పేరుతో దూషించారని పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదుదారుడు ఇప్పటికే క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పని చేస్తున్నారని.. కాబట్టి ఆయనకు ఎస్సీ చట్టం కింద రక్షణ పొందే హక్కు లేదని వాదించారు.హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టుగతంలో ఏపీ హైకోర్టు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు.. ఆయన ఎస్సీ హోదా ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని, ఫలితంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయడం చట్టబద్ధం కాదని పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. హైకోర్టు నిర్ణయం సరైనదేనని వెల్లడించింది. ఒకే సమయంలో వేరొక మతాన్ని ఆచరిస్తూ.. ఎస్సీ హోదాను అనుభవించడం అసాధ్యమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.