రూపాయికి RBI 'బూస్టర్ డోస్'.. 15 ఏళ్లలో తొలిసారి ఇలా.. బ్యాంకులకు కీలక ఆదేశాలు

Wait 5 sec.

RBI: అంతర్జాతీయ మార్కెట్‌లో భారత రూపాయి విలువ నానాటికీ భారీగా పడిపోతేంది. కుప్పకూలుతున్న రూపాయిని కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా () యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. బ్యాంకులు పెద్ద మొత్తంలో డాలర్లను నిల్వ చేసుకోకుండా కీలక నిర్ణయం తీసుకుంది. నెట్ పొజిషన్ల పరిమితులపై భారీగా కోత విధించింది. దాదాపు 10 రెట్లు తగ్గించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. 15 ఏళ్ల తర్వాత తొలిసారి సాధారణంగా బ్యాంకులు తమ వద్ద ఎంత విదేశీ కరెన్సీ డాలర్లు ఉండాలి అనే దానిపై గత 15 ఏళ్లుగా ఆయా బ్యాంకుల బోర్డులే నిర్ణయం తీసుకునేవి. దీనిని నెట్ ఓపెన్ పొజిషన్ లిమిట్ (NOPL)గా పిలుస్తారు. కానీ, రూపాయి సంక్షోభం నేపథ్యంలో ఈ స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టి తానే నేరుగా రంగంలోకి దిగింది. గతంలో బ్యాంకుల బోర్డులు గరిష్ఠంగా 1 బిలియన్ డాలర్ల (1 Billion Dollar) వరకు పొజిషన్లు తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ఆర్‌బీఐ దీనిని 100 మిలియన్ డాలర్లకు (100 Million Dollar) తగ్గించిననట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.డాలర్ల విక్రయమే లక్ష్యం బ్యాంకులు తమ వద్ద డాలర్లను పెద్ద ఎత్తున నిల్వ ఉంచుకుని, రూపాయి విలువ మరింత పడిపోతుందని బెట్టింగ్ (Long Positions) కట్టకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్‌బీఐ తాజా ఆదేశాలతో ఇప్పటి వరకు డాలర్లను భారీగా కొనుగోలు చేసి అట్టి పెట్టుకున్న బ్యాంకులు ఇప్పుడు వాటిని మార్కెట్‌లో విక్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు డాలర్లను విక్రయించడం వల్ల మార్కెట్‌లో డాలర్ల లభ్యత పెరుగుతుంది. దీంతో డాలర్‌కు ఉన్న డిమాండ్ తగ్గి రూపాయి విలువ కొంత వరకు స్థిరపడే అవకాశం ఉంటుంది.దశాబ్ద కాలంలో అత్యంత కనిష్ఠానికి ఈ ఒక్క ఏడాదిలోనే రూపాయి విలువ సుమారు 10 శాతం మేర పడిపోయింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారులు భారత్ నుంచి నిధులను ఉపసంహరించుకోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. రూపాయి విలువను కాపాడటం ఇప్పుడు అత్యంత కీలకమని, ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను వదిలించుకోవాల్సి వస్తుందని, ఇది రూపాయికి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.