MI vs KKR: ఐపీఎల్‌లో నేడు బడా ఫైట్.. వాంఖడేలో విధ్వంసమే!

Wait 5 sec.

ఐపీఎల్ 2025లో క్వాలిఫైయర్ 2 వరకూ వెళ్లి నిరాశచెందిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సారి టైటిల్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. వరల్డ్ క్లాస్ బౌలర్స్, బ్యాటర్లతో ఈ ఏడాది జట్టు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఐపీఎల్ 2026లో వేదికగా ముంబై ఇండియన్స్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే ఈ పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఏడాది కొత్త ఎత్తుగడలతో బరిలోకి దిగుతోంది. 2025 సీజన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లే గెలిచి తీవ్ర నిరాశపరిచింది. 14 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. అయితే, ఈ ఏడాది అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ జట్టు మినీ వేలంలో మంచి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ముఖ్యంగా న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్‌తో పాటు కామెరూన్ గ్రీన్, రచిన్ రవీంద్రను దక్కించుకుంది. దాంతో ఈ ఏడాది ప్లే ఆఫ్స్ లక్ష్యంగా అడుగులేసే అవకాశం ఉంది. హెడ్ టు హెడ్ రికార్డ్స్ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 35 సార్లు తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ 24 మ్యాచ్‌లలో విజయం సాధించగా, కేకేఆర్ 11 మ్యాచ్‌లలో గెలిచింది. అయితే, వాంఖడేలో ఆదివారం జరిగే మ్యాచ్ పోటాపోటీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఆదివారం తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ముంబై ఇండియన్స్ జట్టు అంచనాక్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రూధర్‌‌ఫోర్డ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాజ్ బవా, విల్ జాక్స్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అంచనాఫిన్ అలెన్, సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, ఏఎస్ రాయ్, వరుణ్ చక్రవర్తి, బ్లెస్సింగ్ ముజరబానీ.