కళ్యాణ్ పడాలతో అవార్డును పంచుకున్న తనూజ.. కెమిస్ట్రీ అదిరింది

Wait 5 sec.

ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా స్టార్ మా పరివారం అవార్డ్స్ సందడిగా జరిగాయి. . ఇక రెండో పార్ట్‌ని ఈరోజు (ఆదివారం) సాయంత్రం 6 గంటలకి ప్రసారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు. ఇందులో బిగ్‌బాస్ సీజన్-9 రన్నర్ తనూజ గౌడకి 'ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ 9' అవార్డు దక్కింది. శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా తనూజ ఈ అవార్డును అందుకుంది.నేను ఈ అవార్డుని కళ్యాణ్ పడాలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానని తనూజ స్టేజ్ మీద చెప్పింది. కళ్యాణ్ స్టేజ్ మీదకి రాగానే తీసుకో.. అంటూ అవార్డ్ చేతికిచ్చింది. మీ ఇద్దరినీ ఇలా మ్యాచింగ్ డ్రెస్సులో చూస్తుంటే పాపులర్ జోడీ కూడా మీకే ఇచ్చేయాలనుంది.. అంటూ శ్రీముఖి చెప్పగానే ఇద్దరూ తెగ సిగ్గుపడ్డారు. తర్వాత తనూజ-కళ్యాణ్ కలిసి ఒక మెలొడీకి డ్యాన్స్ చేశారు.ఉత్తమ కోడలిగాఇక 'ఉత్తమ కోడలు' అవార్డ్.. ఇంటింటి రామాయణం అవని (పల్లవి రామిశెట్టి)కి దక్కింది. సింగర్ స్మిత చేతుల మీదుగా అవని అవార్డు అందుకుంది. ఒక సింగర్ ఇంకొక సింగర్‌కి అవార్డు ఇచ్చారని చెప్పగానే స్మిత సర్‌ప్రైజ్ అయ్యారు. దీంతో స్టేజ్ మీద పల్లవి ఒక పాట కూడా పాడారు. తర్వాత 'ఉత్తమ పరివారం' అవార్డ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్‌కి దక్కింది. బుల్లితెరలో నాకు ఇది ఫస్ట్ అవార్డ్.. అంటూ ఆమని గర్వంగా చెప్పారు. మేడమ్ మిమ్మల్ని బ్లాక్ శారీలో చూస్తుంటే "చిలకా ఏ తోడు లేక" సాంగ్ గుర్తొస్తుందని ప్రదీప్ అన్నాడు. నాకు మాత్రం "ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు" పాట గుర్తొస్తుందని నిహారిక కొణిదెల అన్నారు.అలానే 'ఉత్తమ్మ అమ్మమ్మ' అవార్డ్.. కార్తీకదీపం నటి నటకుమారి (పారిజాతం)ని వరించింది. ఇది నాకు ఫస్ట్ అవార్డ్ అంటూ స్టేజ్ మీదే ఒక మాస్ సాంగ్‌కి తీన్మార్ స్టెప్పులేశారు నటకుమారి. ఇది చూసి అవార్డ్ ఇవ్వడానికి వచ్చిన రాజీవ్ కనకాల అవాక్కయ్యారు. మీరు అమ్మమ్మ అంటే నాకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది అంటూ కామెడీ చేశారు.ఇక ప్రోమో చివరిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫేమ్ ధీరజ్-ప్రేమ జోడీకి 'ఉత్తమ జంట' అవార్డు అందజేశారు. 12 ఏళ్ల జర్నీ, 100ల కలలు, మూడు రాష్ట్రాలు, రెండు భాషలు.. ఇది నా ఫస్ట్ అవార్డ్.. బతుకు ఇచ్చింది నాకు కన్నడ అయితే బతకు నేర్పించింది నాకు తెలుగు.. అంటూ ధీరజ్ మాట్లాడాడు. ఇక 'పాపులర్ హజ్బెండ్' అవార్డుని గుండెనిండా గుడిగంటలు హీరో బాలు (విష్ణుకాంత్) అందుకున్నారు.