కేరళంలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు.. తెలంగాణ ఆరు గ్యారంటీలకు.. అక్కడి హామీలకు ఎంత తేడా..!?

Wait 5 sec.

.. ఏప్రిల్ 9న కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు కొద్ది రోజులే గడువు ఉండటంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈసారి కేరళంలో బీజేపీ కూడా బలంగా ప్రచారం చేస్తోంది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. అయితే చాలా చోట్ల మాత్రం పోటీ ప్రధానంగా అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ మధ్యే ఉండే అవకాశం ఉంటుందని అంచనా. గత పదేళ్లుగా కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుండగా.. ఈసారి ఎలాగైనా మలయాళీల మనసు గెలవాలని హస్తం పార్టీ పట్టుదలతో ఉంది. ఇచ్చి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. ఇప్పుడు మలయాళ గడ్డ మీద పాగా వేయడం కోసం ఐదు గ్యారంటీలను సిద్ధం చేసింది. మహిళలు, యువతను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ఇచ్చింది.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కేరళంలోనూ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణల్లో ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిలకు నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కేరళంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రతి మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ తెలంగాణలో ఇంకా అమలు కాలేదు. దీంతో కేరళంలో ఈ హామీని మార్చారని భావించొచ్చు. కేరళలో ప్రస్తుతం నెలకు రూ.2 వేల చొప్పున పెన్షన్లు ఇస్తుండగా.. దాన్ని రూ. 3 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తెలంగాణలో ఫించన్లను రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఈ హామీ కూడా ఇంకా అమలు చేయలేదు.ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తామని కేరళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ పథకానికి కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ పేరు పెడతామని ఆ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు .యువత వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా చిన్న వ్యాపారాల కోసం రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేరళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వృద్ధుల సంక్షేమాన్ని పర్యవేక్షించడం కోసం ప్రత్యేకమైన మంత్రిని నియమిస్తామని కేరళ కాంగ్రెస్ ప్రకటించింది. రబ్బరు సాగు చేసే రైతులను ఆకట్టుకోవడం కోసం కిలో రబ్బరుకు రూ.250 చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తెలంగాణ విషయానికి వస్తే.. రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని ఎకరానికి ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముంగిట హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, వరికి క్వింటాల్‌‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’ను ఎకరానికి రూ.12 వేలకు మాత్రమే పెంచింది. రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీని దాదాపుగా నెరవేర్చింది.ఇందిరమ్మ ఇండ్లు పేరిట సొంత స్థలం ఉన్న పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, గృహ జ్యోతి కింద ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలంగాణ ఎన్నికల ముంగిట హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను అమలు చేస్తోంది. అలాగే పేద కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలంగాణలో హస్తం పార్టీ హామీ ఇచ్చింది.యువ వికాసం కింద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం రూ.5 లక్షల వరకు సాయం చేస్తామని.. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.రెండు రాష్ట్రాల హామీలను పోల్చి చూస్తే.. మహిళలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇచ్చింది. రైతుల కోసం తెలంగాణలో పెట్టుబడి సాయాన్ని భారీగా పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఆ స్థాయిలో పెంచలేకపోయింది. అలాగే తెలంగాణలో మహిళలందరికీ రూ.2500 చొప్పున ప్రతినెలా ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఇంకా అమలు కాలేదు. దీంతో కేరళంలో కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఆరోగ్య బీమా విషయంలో మాత్రం తెలంగాణ కంటే మెరుగ్గా కేరళంలో హామీ ఇచ్చింది. తెలంగాణకు వచ్చే ఆదాయం ఎక్కువ, ఇక్కడి బడ్జెట్ ఎక్కువ. సంక్షేమ పథకాలకు ఇక్కడ ప్రాధాన్యం ఎక్కువ. దీంతో సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణలో కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. 2026-27 తెలంగాణ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకే రూ.50 వేల కోట్లకుపైగా కేటాయించింది.కానీ కేరళం విషయానికి వస్తే.. ఆ రాష్ట్ర ఆదాయం తెలంగాణతో పోలిస్తే తక్కువ. అక్కడి ప్రజలు బాగా చదువుకున్నవారు. ఇప్పుడు అక్కడున్న ఉచిత పథకాలు కూడా తెలంగాణ స్థాయిలో లేవు. దీంతో అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా, మలయాళీలను ఆకట్టుకునేలా హామీలు ఇచ్చింది. తెలంగాణలో లాగే కేరళంలోనూ మహిళలు, యువతను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం ఎంత మేర సక్సెస్ అవుతుందనేది మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది.