Stock Split: స్మాల్ క్యాప్ కేటగిరిలోని టెక్స్టైల్ సెక్టార్ సంస్థ ఆర్ అండ్ బీ డెనిమ్స్ లిమిటెడ్ (R And B Denims Limited) డబుల్ బొనాంజా తీసుకొచ్చింది. ఈ చేసేందుకు ఆమోదం తెలుపారు. ఈ ప్రయోజనాలని పొందేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ ఏప్రిల్ 3గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఏప్రిల్ 3 తేదీ ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. మరో 3 రోజుల్లో ఈ కంపెనీ షేర్లు ఎక్స్- బోనస్, ఎక్స్ - స్ప్లిట్ ట్రేడింగ్ చేయనున్నాయి. మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో 38 శాతం నష్టాన్ని మిగిల్చింది. ఈ స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇష్యూ తర్వాత షేరు ధర భారీగా తగ్గనుంది. అయితే, పెట్టుబడి విలువలో ఏ మార్పు ఉండదని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. 2:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ కి ఆమోదం తెలిపారు. దీని అర్థం రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 షేరుని కొనుగోలు చేసినట్లయితే రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 2 షేర్లుగా విభజించి జారీ చేస్తారు. ఈ స్టాక్ స్ప్లిట్ కి సంబంధించిన రికార్డు డేట్ ఏప్రిల్ 03, 2026గా నిర్ణయించారు.మరోవైపు ఇదే సమావేశంలో 1:2 రేషియోలో జారీ చేసేందుకు కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారు. రికార్డు డేట్ నాటికి రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 2 షేర్లను తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉంటే వారికి అదనంగా రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 ఈక్విటీ షేరుని బోనస్ రూపంలో ఉచితంగా ఇస్తారు. దీనికి సంబంధించిన రికార్డు డేట్ సైతం ఏప్రిల్ 3, 2026గానే నిర్ణయించినట్లు కంపెనీ తమ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. చివరి ట్రేడింగ్ సెషన్లో ఆర్ అండ్ బీ డెనిమ్స్ లిమిటెడ్ షేరు 4.99 శాతం నష్టంతో రూ. 64.52 వద్ద స్థిరపడింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 203 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 64.53 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 14 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో 60 శాతం నష్టాన్ని మిగిల్చింది. గత ఆరు నెలల్లో 38 శాతం నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 580 కోట్ల వద్ద ఉంది.