భాగంగా ఈ రోజు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇది నాలుగో మ్యాచ్. మొదటి మూడు మ్యాచ్‌లలో హోం టీమ్సే విజయం సాధించడం విశేషం. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించాయి. దాంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుందా? లేక గుజరాత్ సర్‌ప్రైజ్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. న్యూ చంఢీఘడ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్ 2025లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది ఎలా ఆరంభిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య కేవలం ఆరు మ్యాచ్‌లే జరిగాయి. అందులో పంజాబ్ కింగ్స్ మూడింటిలో గెలవగా, గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 243 హైయెస్ట్ స్కోర్ చేయగా, గుజరాత్ 232 పరుగులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య నమోదైన లోయెస్ట్ స్కోర్ 142. ఓవరాల్ ఇరు జట్ల మధ్య యావరేజ్ మ్యాచ్ స్కోర్ 178 ఉంది. అడుగు దూరంలో ఐపీఎల్ ట్రోఫీని కోల్పోయిన పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది ఎలాగైనా టైటిల్ నెగ్గాలనే బలమైన సంకల్పంతో బరిలోకి దిగుతోంది. గత సీజన్‌లో అంతగా రాణించలేకపోయిన గుజరాత్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ దిశగా ఆడాలని చూస్తోంది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా ఉండగా.. గుజరాత్ టైటాన్స్‌కు బ్యాటింగ్ కాస్త వీక్‌గా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టు అంచనాప్రియాన్షు ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కూపర్ కాన్‌‌లీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినీస్, మార్కో యాన్సన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, వైశాక్ విజయ్‌కుమార్. గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాశుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, కగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ.