కొరడా ఝులిపించిన RBI.. మరో బ్యాంకుపై భారీ పెనాల్టీ.. నిబంధనల ఉల్లంఘన, ఖాతాదారుల పరిస్థితి ఏంటి?

Wait 5 sec.

RBI Penalty: బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ, కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలు ఉల్లంఘిస్తున్న బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. మానీటరీ పాలసీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించని బ్యాంకులపై చర్యలు చేపడుతోంది. కొన్ని బ్యాంకుల లైసెన్సులు సైతం రద్దు చేస్తోంది. విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యాంకుకు గట్టి షాక్ ఇచ్చింది. మానీటరీ పాలసీ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన క్రమంలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు (Airtel Payments Bank)పై భారీగా పెనాల్టీ విధించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో వెల్లడికి సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుపై రూ.31.80 లక్షలు మానీటరీ పెనాల్టీ విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. మార్చి 31, 2025 నాటికి బ్యాంక్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి పర్యవేక్షక మూల్యంకన కోసం తాము చట్టబద్ధమైన తనిఖీలు నిర్వహించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ తనిఖీల్లో భాగంగా ఆర్‌బీఐ మార్గదర్శకాలు, ఆర్థిక నివేదికకు సంబంధించిన రూల్స్ పాటించడం లేదని గుర్తించినట్లు తెలిపింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశామని, బ్యాంకు నుంచి వచ్చిన సమాధానం, అదనపు వివరాలను పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వార్షిక ఆర్థిక నివేదిక 2024-25కి సంబంధించి పలు వివరాలను వెల్లడించడంలో బ్యాంకు విఫలమైనట్లు గుర్తించామని, అందుకే ఈ పెనాల్టీ వేయాల్సి వచ్చిందని తెలిపింది. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా? అంతేగానీ బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏ లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటుపై ప్రభావం చూపించదని స్పష్టం చేసింది. అంటే సాధారణ బ్యాంకింగ్ సర్వీసులు కొనసాగుతాయని, ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. బ్యాంకుపై పెనాల్టీ విధించడం వల్ల ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని, రోజు వారి బ్యాంకింగ్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కస్టమర్లకు అన్‌ఆథరైజ్డ్ ఎలక్ట్రానికి ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో విఫలమైనట్లు గుర్తించిన క్రమంలో యూనియన్ బ్యాంకుకు ఏకంగా రూ. 95.40 లక్షల పెనాల్టీ వేసింది. ఇక సెంట్రల్ బ్యాంకుకు రూ.63.60 లక్షలు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.58.50 లక్షల పెనాల్టీ వేసింది. అలాగే పైన్ ల్యాబ్స్ పై రూ.3.10 లక్షలు పెనాల్టీ విధించింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుపై చర్యలు చేపట్టింది.