వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ను గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని నిర్వహకులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ టోర్నీకి వేదికలను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి, మార్చిలో ఈ టోర్నీ జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2026లో మొత్తంగా 20 జట్లు పాల్గొనున్నాయి. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరిగిన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు సమాచారం. అంతేకాకుండా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ, ముంబైలోని వాంఖడే, చెన్నైలోని ఎంఎ చిదంబరం క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలోని రెండు వేదికలు కూడా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లు ఈ వేదికల్లోనే జరుగుతాయి. పాకిస్థాన్ ఫైనల్ చేరితే ఫైనల్ మ్యాచ్ శ్రీలంకనే జరగనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.టీ20 ప్రపంచకప్ 2026లో ఆడే జట్లు ఇవే..1. అఫ్ఘానిస్థాన్, 2. ఆస్ట్రేలియా, 3. బంగ్లాదేశ్, 4. కెనడా, 5. ఇంగ్లాండ్, 6. భారత్, 7. ఐర్లాండ్, 8. ఇటలీ, 9. నమీబియా, 10. నేపాల్, 11. నెదర్లాండ్స్, 12. న్యూజిలాండ్, 13. ఒమన్, 14. పాకిస్థాన్, 15. దక్షిణాఫ్రికా, 16. శ్రీలంక, 17. యూఏఈ, 18. యూఎస్ఏ, 19. వెస్టిండీస్, 20. జింబాబ్వేటోర్నీ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే..ఈ టోర్నీలో పాల్గొనే మొత్తంగా 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఇందులో ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉంటాయి. రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్టు మిగతా 4 జట్లతో మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. లీగ్ స్టేజ్ ముగిసే సరికి టాప్-2లో ఉన్న జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. అక్కడ కూడా ఈ 8 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్టు తమ గ్రూపులోని మిగతా 3 టీమ్స్‌తో ఆడుతుంది. సూపర్-8లో ఒక్కో గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్ చేరుకుంటాయి.