రూ.200 కోట్లు, 26 మంది బిలియనీర్లు.. అయినా భారతీయుడి గెలుపును అడ్డుకోలేకపోయాారు!

Wait 5 sec.

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లోని ఓడించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ప్రపంచ ఆర్థిక రాజధాని నగరంలో మొబైల్ కిరాణా దుకాణాలు, ఉచిత ప్రజా రవాణా, పిల్లల సంరక్షణ కేంద్రాలు వంటివి వాటితో జీవన వ్యయాన్ని తగ్గించుకోవచ్చని హామీలు ఇచ్చి న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే, అయ్యారు. ఫోర్బ్స్ ప్రకారం.. కనీసం 26 మంది బిలియనీర్లు, ధనవంతుల కుటుంబాలు మొత్తం 220 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.195 కోట్లు) మమ్దానీకి వ్యతిరేకంగా ప్రకటనలు, ఆయన ప్రత్యర్థుల మద్దతుకోసం ఖర్చుచేశారు. వీరిలో బ్లూమ్‌బర్గ్ ఎల్‌పీ కో-ఫౌండర్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్, హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మన్, ఎయిర్‌బిఎన్‌బీ సహ- వ్యవస్థాపకుడు జో గెబ్బియా, ఎస్తీ లాడర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఆండ్రూ కువోమోకు మద్దతు ఇచ్చే స్వతంత్ర వ్యయ కమిటీలు, రాజకీయ యాక్షన్ కమిటీలకు కనీసం 100,000 డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) విరాళంగా అందించారు. కువోమో కోసం మైఖేల్ బ్లూమ్‌బర్గ్ ఏకంగా 8 మిలియన్ డాలర్లు (రూ.66 కోట్లు) ఖర్చు చేయగా.. అక్మన్ 1.75 లక్షల డాలర్లు, లాడర్ 7.5 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు. మొత్తం 22 మిలియన్ డాలర్ల విరాళాల్లో సగం.. జూన్ 24న డెమొక్రాట్ మేయర్ అభ్యర్థిగా మమ్దానీ ఎన్ని కావడానికే ముందు అందజేయడం గమనార్హం. జూన్‌లో ‘ఫిక్స్ ది సిటీ, ఇంక్’ మైఖేల్ బ్లూమ్‌బర్గ్ ఇచ్చిన 8.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.69 కోట్లు) విరాళం ఎన్నికలకు ముందు అందిన విరాళాల్లో అతి ముఖ్యమైంది. ఇతర ఇతర ప్రముఖ దాతల్లో నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాస్టింగ్స్, మీడియా అధినేత బ్యారీ డిల్లర్ ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ 250,000 డాలర్లు (సుమారు ₹2.1 కోట్లు) అందించారు. మామ్దానీకి వ్యతిరేకంగా కన్సర్వేటివ్‌‌లు ఓ చేయివేశారు. కేసినో మాగ్నేట్ స్టీవ్ విన్ అక్టోబరులో 500,000 డాలర్లు (సుమారు ₹4.1 కోట్లు) విరాళం ఇచ్చారు. చమురు వ్యాపారి జాన్ హెస్ మాత్రం కొన్ని నెలల వ్యవధిలో మొత్తం ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.8.3 కోట్లు) విరాళంగా అందించారు.ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం.. అక్టోబర్ 13న నిర్వహించిన మాట్లాడుతూ... ‘‘బిల్ అక్మన్, రొనాల్డ్ లాడర్ లాంటి బిలియనీర్లు ఈ ఎన్నికల్లో కోట్ల డాలర్లను ఖర్చు పెట్టారు. ఎందుకంటే వారి మాటల్లో చెప్పాలంటే వారి ఉనికికి నేను ముప్పు.. ఒక విషయం అంగీకరించాలి వారు చెప్పింది నిజమే’’ అని వ్యాఖ్యానించారు. మమ్దానీకి వ్యతిరేకంగా విరాళాలు ఇచ్చిన 26 మంది బిలియనీర్లలో 16 మంది న్యూయార్క్ నగరానికి చెందినవారేనని ఫోర్బ్స్ గుర్తించింది. మమ్దానీ ప్రత్యర్థులకు సహకరించిన బిలియనీర్లుమైఖేల్ బ్లూమ్‌బర్గ్: 8.3 మిలియన్ డాలర్లు (రూ.69 కోట్లు)జో గెబ్బా: 3 మిలియన్ డాలర్లువిలియమ్ లాడర్ అండ్ ఫ్యామిలీ 2.6 మిలియన్ డాలర్లుబిల్ అక్మన్: 1.75 మిలియన్ డాలర్లుజొనాథన్ టిచ్ అండ్ ఫ్యామిలీ: 1.2 మిలియన్ డాలర్లుజాన్ హెస్: మిలియన్ డాలర్లుడానియల్ లోబ్: 775,000 డాలర్లుబ్యారీ డిల్లర్: 500000 డాలర్లుస్టీవ్ వ్యాన్: 500000 డాలరలు.మార్సెలలా గ్యురినో హైమోవిట్జ్: 400000 డాలర్లుడేవిడ్ వాలెంట్స్: 350,000 డాలర్లురీడ్ హస్టింగ్స్: 250,000 డాలర్లుజాన్: ఫిష్ 250,000 డాలర్లుడేవిడ్ లిచ్టెస్టిన్: 250,000అలీసా వాల్టన్: 200000 డాలర్లు.జెర్రీ స్పేయర్: 150,000 డాలర్లు.స్టెఫానీ కోల్మన్: 150,000 డాలర్లుడ్రస్ట్ ఫ్యామిలీ: 110,000 డాలర్లుఫిషర్ ఫ్యామిలీ: 110,000 డాలర్లుడానిల్ ఓచ్: 100000 డాలర్లుకెన్ లాంగోన్: 100000 డాలర్లుజేమ్స్ అండ్ కాథర్యిన్ ముర్దోక్: 100000 డాలర్లుబ్రూస్ అండ్ సుజై కోవెనర్: 100000 డాలర్లు.రిచర్డ్ కర్ట్జ్: 100000 డాలర్లుఎలగన్యన్ ఫ్యామిలీ: 100000 డాలర్లు.మమ్దానీ విజయానంతరం విమర్శకుల మద్దతు ఆఫర్లు. మొదట మమ్దానీకి వ్యతిరేకంగా ఉన్న వాల్ స్ట్రీట్ ప్రముఖుల్లో కొందరు, ఆయన విజయం తర్వాత మద్దతు అందించేందుకు ముందుకు వచ్చినట్లు ఫార్చ్యూన్ నివేదించింది. బిల్ అక్మన్ శుభాకాంక్షలు చెబుతూ.. ‘నీ భుజాలపై గొప్ప బాధ్యత ఉంది.. న్యూయార్క్ నగరానికి నేను ఏ విధంగా సహాయం చేయగలనో చెప్పు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ట్వీట్ చేశారు.