ఏపీ ముఖ్యమంత్రి నారా నాయుడు.. తన సొంత నియోజకవర్గానికి భారీ శుభవార్త అందించారు. శనివారం ఒక్క రోజే ఒకేసారి 7 పరిశ్రమలకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు వర్చువల్‌ విధానంలోఈ ఏడు కంపెనీలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికులు, వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు మరో శుభవార్త వినిపించారు. త్వరలోనే రూ.6,300 కోట్లతో మరో 8 కంపెనీలు వస్తున్నాయని ప్రకటించారు. ఈ కంపెనీలకు అవసరమైన కరెంట్‌ను స్థానికంగానే తయారు చేస్తామని.. కుప్పం నుంచే వివిధ ప్రాంతాలకు సౌర విద్యుత్ అందిస్తామన్నారు.కుప్పంలో పెట్టుబడులు పెడుతున్న ఏడు కంపెనీలు ఇవే.. మరోవైపుపెడుతున్నాయి. ఈ ఏడు కంపెనీల కోసం ఏపీ ప్రభుత్వం కుప్పంలో 241 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఏడు సంస్థలు డెయిరీ, వంటనూనెల తయారీ, ల్యాప్ టాప్, మొబైల్ ఎక్సెసరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వంటి రంగాలకు చెందినవి. వీటిలో , ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, ALEAP మహిళా పార్కు,స E–Royce EV సంస్థలు ఉన్నాయి. ఈ ఏడు పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 23 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో డెయిరీ, పౌల్ట్రీ రంగం విస్తరించాలని సూచించారు. మైక్రో ఇరిగేషన్ విధానాన్ని కుప్పంలో ప్రారంభించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యుయర్ రావాలన్న చంద్రబాబు.. కుప్పంను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ దిశగా ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో యూనివర్సిటీతో పాటుగా ఇంజినీరింగ్‌, మెడికల్, పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కుప్పం నుంచి నాణ్యమైన పండ్లను విదేశాలకు ఎగుమతి చేస్తామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు శంకుస్థాపన చేసిన సంస్థలను నిర్దేశించిన సమయానికి ప్రారంభించేలా చూడాలని చంద్రబాబు సూచించారు.