: ఎంత సంపాదించినా చాలా మంది డబ్బును పొదుపు చేసి.. . ఇది చాలా మందికి ఒక పెద్ద కల. అయితే ఈ కలను నెరవేర్చుకునే క్రమంలో.. సరైన ప్లాన్ లేకపోతే మాత్రం అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆర్థిక నిపుణులు ఎన్నో చిట్కాలు చెబుతుంటారు. ఇక్కడ మనం దీనికి సంబంధించి ఒక రూల్ గురించి చూద్దాం. అదే 5/20/30/40 రూల్. ఇది ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయాలనుకునే వారికి రుణం తీసుకోవడంలో సహాయం చేస్తుంది. ఇక్కడ లోన్ ఇబ్బంది లేకుండా తిరిగి చెల్లించడంలోనూ మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇక్కడ రూల్‌లో ముందుగా 5 అంటే వార్షిక ఆదాయాన్ని సూచిస్తుంది. అంటే మీరు కొనుగోలు చేసే ఇంటి ధర మీ వార్షిక ఆదాయానికి 5 రెట్లు మించొద్దు. 20 అంటే ఇది కాల పరిమితిని సూచిస్తుంది. అంటే లోన్ తీసుకున్నప్పుడు కాల పరిమితిని 20 ఏళ్లలోపు ఉంచుకోవాలి. దీని వల్ల వడ్డీ ఖర్చు తగ్గించుకోవచ్చు. తర్వాత 30 ఇది ఈఎంఐని సూచిస్తుంది. అంటే నెలవారీగా చెల్లించాల్సిన ఈఎంఐ .. మీ నెలవారీ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. చివరగా 40 అనేది ముందస్తు చెల్లింపు అంటే డౌన్ పేమెంట్‌ను సూచిస్తుంది. ఇక్కడ మొత్తం ఇంటి విలువలో కనీసం 40 శాతం మొత్తాన్ని ముందుగానే చెల్లించాలి. ఇవన్నీ సరిగా పాటిస్తే మీరు పెద్దగా ఇబ్బందుల్లేకుండా ఉండేలా చేస్తుంది. ఇది మీ ఈఎంఐలు.. పొదుపు ఖాతాల్లోకి వెళ్లకుండా నిర్వహించదగిన స్థాయిలో ఉండేలా చేస్తుందని చెప్పొచ్చు. సుదీర్ఘ కాలంలో ఇంకా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి టెన్యూర్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తగ్గించడంలో సహాయం చేస్తుంది. >> కొన్ని సార్లు ఇక్కడ 5 రెట్ల ఆదాయ పరిమితిని పాటించడం కష్టమే కావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ నియమాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇక్కడ 3/20/30/40 రూల్ ఫాలో కావాలి. ఇక్కడ ఆదాయానికి 3 రెట్ల వరకు ఇంటి ధర ఉండేలా చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం మీపై భారం తగ్గుతుంది. అదనపు ఆర్థిక భద్రత కోసం అయితే.. 5/25/25/35 రూల్ సూచిస్తున్నారు. ఇక్కడ చివరగా 5/20/30/40 రూల్ అనేది మీ కలల్ని పరిమితం చేయడం కాదు.. తెలివిగా కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడంలోనూ సహాయం చేస్తుంది. దీన్ని ఫాలో అవడం ద్వారా.. మీరు అప్పుల బారిన పడకుండా కాపాడుతుంది.