చంద్రయాన్-2 మరో అద్భుతం.. చంద్రుడిపై మట్టి, నీటి జాడలపై ఇస్రో బిగ్ అప్‌డేట్

Wait 5 sec.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ().. 2019లో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇస్రో అనుకున్నది సాధించలేకపోయింది. అయితేఅయిన సంగతి తెలిసిందే. అయితే చంద్రయాన్-2 పూర్తిగా సక్సెస్ కాకపోయినా.. కీలక డేటాను మాత్రం ఇస్రోకు అందిస్తోంది. చంద్రయాన్-2లోని ఆర్బిటర్ పంపించిన కీలక సమాచారం ఆధారంగానే.. చంద్రుడిపై పరిశోధనలు జరుపుతున్న ఇస్రో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేస్తున్నారు. 2019 నుంచి చంద్రుని చుట్టూ తన మిషన్‌ను కొనసాగిస్తున్న ఈ ఆర్బిటర్.. జాబిల్లి ధ్రువ ప్రాంతాలకు సంబంధించిన కీలకమైన డేటాను అందించింది. చంద్రుడి పైనుంచి చంద్రయాన్-2 పంపించిన సమాచారం ఆధారంగా ఇస్రో కీలక విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే తొలి పూర్తి పోలార్ మ్యాప్‌ను ఇస్రో తాజాగా విడుదల చేసింది. చంద్రుడిపై నీరు, మట్టి జాడలకు సంబంధించిన విషయాలను వీటి ద్వారా శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. చంద్రయాన్-2 ఆర్బిటర్.. తన డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ డేటాను ఉపయోగించి.. చంద్రుని తొలి పూర్తి పోలార్ మెట్రిక్, ఎల్-బ్యాండ్ రాడార్ మ్యాప్‌లను విడుదల చేసింది. ఈ మ్యాప్‌లు 25 మీటర్లు పర్ పిక్సెల్ అధిక రిజల్యూషన్‌ను కలిగి ఉన్నాయి. చంద్రుని ఉపరితలం, ఉపరితలం కింద ఉన్న నిర్మాణాలను గుర్తించడానికి ఈ మ్యాప్‌లు శాస్త్రవేత్తలకు ఉపయోగపడనున్నాయి.గత 5 ఏళ్లలో సేకరించిన 1,400 రాడార్ డేటాసెట్‌లను ప్రాసెస్ చేయడం ద్వారా.. ఉపరితలం కింద నీటి మంచు నిల్వలు ఉండే ఉష్ణ స్థిరత్వ జోన్లను కనుగొనడానికి ఇస్రో సైంటిస్ట్‌లు కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి మంచు నిక్షేపాల ఉనికిని సూచించడానికి సర్క్యులర్ పోలరైజేషన్ నిష్పత్తి (సీపీఆర్) వంటి అధునాతన రాడార్ కొలమానాలను ఉపయోగిస్తున్నారు.ఈ మ్యాప్‌లు, వాటి ద్వారా లభించే సమాచారం ఆధారంగా.. భవిష్యత్తులో చంద్రునిపై చేపట్టే మిషన్‌లకు కీలకంగా మారనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జాబిల్లిపై ఉన్న వనరులను వినియోగించుకోవడాని.. అదే సమయంలో చంద్రుడిపై ల్యాండింగ్ సైట్‌ను ఎంపిక చేయడానికి అమూల్యమైన సమాచారాన్ని అందించనున్నాయని పేర్కొంటున్నారు.