లైఫ్‌స్టైల్ పెద్దగా మార్చకుండానే ఇలా ఏటా రూ. 1 లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు.. ఈజీ ట్రిక్స్‌తో..

Wait 5 sec.

Money Saving Tips: చాలా మందిలో ప్రస్తుత కాలంలో.. ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని చెప్పొచ్చు. అవును.. వెనుకటి రోజుల్లో పెద్దలు చాలా డబ్బు ఆదా చేసేవారు. అదే ఇప్పుడు చూస్తే.. ఎంత సంపాదించినా చాలట్లేదు. అవసరాలు అలా పెరిగిపోయాయో లేదా ఖర్చులు పెరుగుతున్నాయో తెలియదు కానీ చాలా మంది అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అయితే.. డబ్బును ఆదా చేసేందుకు ఎన్నో చిట్కాలు పాటించాలి. మీ జీవన శైలిలో పెద్దగా మార్పులు చేయకుండానే కేవలం ఆదా అవుతుంది. ఇందుకోసం నిపుణులు చెప్పే పాకెట్ ఫ్రెండ్లీ టిప్స్ చూద్దాం. >> గుర్తించని ఖర్చుల్ని కనుగొనడం- డబ్బు ఎక్కడ వృథా అవుతుందో తెలుసుకోవడంతోనే మొదటి అడుగు పడుతుంది. ఇందుకోసం 30 రోజుల పాటు మీ ఖర్చుల్ని ట్రాక్ చేయడం ద్వారా ఎక్కడెక్కడ అనవసర ఖర్చులు పెడుతున్నారో అవగాహనకు రావొచ్చు. ఈ ట్రాకింగ్ ద్వారా లైఫ్ స్టైల్‌ను త్యాగం చేయకుండానే.. మీ మొత్తం ఖర్చులో 10-20 శాతం వరకు తగ్గించుకోవచ్చు. ఇక్కడ మీ నెలవారీ ఖర్చు రూ. 50 వేలు అనుకుంటే 10 శాతం తగ్గించుకున్నా.. ఏటా రూ. 60 వేలు ఆదా చేసుకోవచ్చు.>> సబ్‌స్క్రిప్షన్స్, ప్లాన్స్‌పై ఆదా- ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీ, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్ల కోసం చాలా ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ నెలవారీ ప్లాన్స్ నుంచి వార్షిక ప్లాన్స్‌కు మారడం వల్ల పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. దాదాపు 2-3 నెలల సబ్‌స్క్రిప్షన్ మొత్తం ఆదా అవుతుందని చెప్పొచ్చు. >> ఫుడ్ డెలివరీ- ఇప్పుడు ఎక్కువగా ఆర్డర్ చేసే ఫుడ్ డెలివరీల్ని తగ్గించుకోవడం వల్ల కూడా నెలకు రూ. 4 వేల వరకైనా ఆదా చేసుకోవచ్చు. రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకుంటే.. డెలివరీ రుసుములు, ప్యాకేజీ ఛార్జీలు, హ్యాండ్లింగ్ ఫీజు, టిప్స్ వంటివి అదననంగా చెల్లించాల్సి వస్తోంది. వీటిని తగ్గించుకోవచ్చు. బయట టీ, కాఫీ, టిఫిన్ వంటి వాటిల్లోనూ కాస్త ఖర్చు తగ్గించుకోవచ్చు.>> రివార్డ్స్ పొందడం- ఖర్చుల్ని ఆపకుండా దాని నుంచి రివార్డుల్ని కూడా పొందొచ్చు. యూపీఐ/ఫ్యూయెల్ రివార్డ్ యాప్స్, ఇ- కామర్స్ ఆఫర్లు, పేమెంట్ యాప్స్ ఉపయోగించి మీ నిత్యావసరాలు, ఇంధనంపై క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్స్ పొందొచ్చు. క్రెడిట్ కార్డులపైనా ప్రతి కొనుగోలుపై పాయింట్లు, రాయితీ పొందొచ్చు. వీటిని సరిగా ఉపయోగించడం తెలిసుండాలి. >> రుణాలు, బీమా- మీరు అధిక వడ్డీ రేటుతో ఉన్న హోం, పర్సనల్ లోన్‌ను తక్కువ వడ్డీ రేటు ఉన్న రుణాలకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. . ప్రస్తుత బీమా పాలసీలు ఉంటే మీకు అవసరం లేని వాటిని లేదా అధికంగా చెల్లిస్తున్న యాడ్- ఆన్స్‌ను తొలగించడం వల్ల వార్షిక ప్రీమియం తగ్గించుకోవచ్చు. ఇలా వీటిల్లో కొన్ని సరిగా పాటించడం ద్వారా కూడా ఏటా రూ. 50 వేల నుంచి లక్ష రూపాయలకుపైగా ఆదా చేసుకోవచ్చు. ఇది మీకు పలు విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.