హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడితో కలిసి తన భార్య పారిపోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం అనే టెకీ.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అతని భార్య గురించి సీతారాం రాసిన 19 పేజీల ఆత్మహత్య లేఖను గుర్తించిన పోలీసులు.. ఆ దిశగా విచారణ చేపట్టి.. అతడి భార్య సహా మొత్తం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక ఆ సూసైడ్ లెటర్‌లో సంచలన విషయాలను టెకీ సీతారాం వెల్లడించాడు. తన భార్యకు ముగ్గురు వ్యక్తులతో ఉన్నాయని పేర్కొనడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. 36 ఏళ్ల టెకీ సీతారాం తాను చనిపోవడానికి ముందు రాసిన 19 పేజీల సూసైడ్ నోట్‌ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తన భార్య రేణుక అరాచకాలు తట్టుకోలేకే సీతారం బలవన్మరణానికి గురైనట్లు అతడి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక తాను చనిపోవడానికి తన భార్య పెట్టుకున్న వివాహేతర సంబంధాలే కారణమని.. చాలా మందితో రేణుక ఎఫైర్లు కొనసాగించిందంటూ సూసైడ్ లేఖలో సీతారాం రాసిన విషయాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. 19 పేజీల లేఖలో తన భార్య సాగించిన అరాచకాలన్నింటినీ సీతారం వివరించగా.. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. రేణుకతో పాటు ఆమె లవర్లను కూడా అరెస్ట్ చేశారు.ఇక 2018లో తనకు, రేణుకకు వివాహం జరిగిందని సీతారాం వివరించాడు. ఆ తర్వాత జరిగిన అన్ని విషయాలను ఆ సూసైడ్ లేఖలో రాసుకున్నాడు. పెళ్లైన ఏడాదిన్నరలోనే రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని పేర్కొన్నాడు. అందులో ఒకరితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేసిందని.. వాటిని రమణ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసినట్లు తెలిపాడు. వాటిని చూసి తాను ఎలా తట్టుకోవాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోలు చూసిన తర్వాతే.. రేణుక నిజస్వరూపం ఏంటో తనకు తెలిసిందని సీతారాం లేఖలో వివరించాడు. ఆ ఘటన తర్వాత తాను ఎంత నచ్చజెప్పినా రేణుక వ్యవహార శైలి మాత్రం మారలేదని రాశాడు. ఆమె మారకపోగా ఆత్మహత్య చేసుకుంటానని తనను బెదిరింపులకు గురి చేసినట్లు పేర్కొన్నాడు. తనకు నెలకు రూ.2 లక్షల జీతమని.. తన భార్యను చాలా బాగా చూసుకున్నానని సీతారాం వెల్లడించాడు. అయినప్పటికీ.. తన భార్య మాత్రం చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా తాను తన భార్యను గుడ్డిగా నమ్మడమే తాను చేసిన తప్పా అంటూ లేఖలో సీతారాం ప్రశ్నించాడు. ఈ కేసులో సీతారాం రాసిన సూసైడ్ నోట్‌ను కేసు దర్యాప్తులో పోలీసులకు కీలకంగా మారింది.