లోన్ చెల్లించకున్నా.. బ్యాంకులు, అప్పులోళ్లు జప్తుచేయలేని సేవింగ్స్ ఇవే.. ఎంత డబ్బున్నా సరే!

Wait 5 sec.

: మనలో చాలా మంది లోన్లు తీసుకుంటుంటారు. . ఇక్కడ ఖర్చులు పెరగడమో లేదా జీతం చాలక అవసరాల రీత్యానో బ్యాంకుల్లో, ఇతర ఆర్థిక సంస్థల్లో అలాగే వడ్డీ వ్యాపారుల దగ్గర లోన్లు తీసుకుంటుంటారు. ఈ రోజుల్లో లోన్ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఇక్కడ లోన్ తిరిగి చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే బ్యాంకుల్లో లోన్ తీసుకొని.. అనుకోని పరిస్థితుల్లో తిరిగి చెల్లించకపోతే ఆస్తుల్ని జప్తు చేస్తాయన్న భయం చాలా మందిలో ఉంటుంది. గోల్డ్ లోన్ తీసుకున్నవారు కూడా తిరిగి చెల్లించకుంటే తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేస్తాయి. అయితే బ్యాంకులు ఆస్తుల్ని జప్తు చేసే రూల్ అన్నింటికీ వర్తించదు. అన్ని ఆస్తుల్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జప్తు చేయలేవు. కొన్ని ప్రత్యేక ఆస్తులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది చట్టం. ముఖ్యంగా ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కోసం, కుటుంబ సంరక్షణ కోసం ఉన్న నిధులు వంటి వాటికి చట్టపరంగా రక్షణ లభిస్తుంది. ఇందులో భాగంగానే కొన్ని రకాల సేవింగ్స్‌ను.. బ్యాంకులు జప్తు చేయలేవు. వీటిల్లో ప్రధానంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), గ్రాట్యుటీ నిధులు వంటివి ఉన్నాయి. ఈపీఎఫ్: ఉద్యోగి భవిష్యత్తు కోసం నిల్వ చేసే నిధి ఈపీఎఫ్. ఇక్కడ కోర్ట్ ఆర్డర్ ఉన్నా సాధారణంగా జప్తు చేయలేరు. ఇది పూర్తిగా రక్షిత నిధి. దీంట్లో ఎంత డబ్బున్నా.. జప్తు నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. పీపీఎఫ్: . చట్టపరంగా ఈ డబ్బును కూడా బ్యాంకులు తాకలేవు. దీనికి కూడా చట్టపరంగా పూర్తి రక్షణ ఉంటుంది. గ్రాట్యుటీ: సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల సేవలకు ఇచ్చే రివార్డ్ ఇది. ఇది రిటైర్మెంట్ సమయంలో లభిస్తుంది. బ్యాంకులకు దీనిని కూడా జప్తు చేసే అధికారం ఉండదు. పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్: ఇది వ్యక్తిగత జీవనాధారం కిందికే వస్తుంది. దీనిని కూడా జప్తు చేసే వీలుండదు. ఇన్సూరెన్స్ పాలసీలు: ఇక్కడ నామినీలు ఉన్నప్పుడు కొన్ని కేసుల్లో చట్టపరంగా రక్షణ లభిస్తుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌.. టైర్-1 ఖాతాలోని సేవింగ్స్‌ను కూడా జప్తు చేసే అవకాశం ఉండదు.అంటే ముఖ్యంగా పీపీఎఫ్, ఈపీఎఫ్ వంటి వాటిని రిటైర్మెంట్ నిధులుగా పరిగణిస్తారు. పెన్షన్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ కిందికి వస్తాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే.. హోం లోన్ తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించకపోతే.. ఇంటిని; వెహికిల్ లోన్ తీసుకొని చెల్లించకపోతే వాహనాన్ని; గోల్డ్ లోన్ తీసుకొని చెల్లించకుంటే బంగారాన్ని, ఇతర తనఖా పెట్టి తీసుకున్న రుణాల సమయంలో హామీగా ఇచ్చిన ఆస్తులు జప్తు అవుతాయి. వీటితో పాటు.. సాధారణ బ్యాంక్ అకౌంట్లు.. చిన్న పొదుపు పథకాలు వంటి వాటికి నామినీ పేరు ఉన్నంత మాత్రాన.. జప్తు నుంచి పూర్తి రక్షణ లభించదు.