రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆయన చనిపోవడానికి ముందు తన భార్య ప్రవర్తన, ఆమె అరాచకాలు మొత్తాన్ని ఆత్మహత్య లేఖలో టెకీ సీతారాం రాసి పెట్టగా.. అవన్నీ బయటికి రావడంతో.. పెను సంచలనంగా మారుతోంది. ఆ సూసైడ్ లెటర్ చదువుతుంటే ఒక్కొక్కరికీ గుండె తరుక్కుపోతోంది. తన భార్యకు 3 , 6 ప్రేమ కథలు ఉన్నాయంటూ సీతారాం పేర్కొనడం.. వాటన్నింటినీ వదిలేయమని చెప్పినా ఆమె వినకపోవడం వంటి విషయాలు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తన భార్య రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ప్రైవేట్ వీడియోలను.. ఆమె ప్రియుడికి షేర్ చేసిందని ఆ సూసైడ్ లేఖ ద్వారా తెలుస్తోంది. ఆ ప్రియుడు.. వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని అందులో టెకీ సీతారాం తెలిపాడు. ఇక చనిపోవడానికి ముందు టెకీ సీతారాం తన సోషల్ మీడియాలో స్టేటస్‌లో 19 పేజీల సూసైడ్ నోట్‌ను పెట్టడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారాంకు.. నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తమకు పెళ్లి అయిన తర్వాత రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం సాగించిందని సీతారాం ఆరోపించాడు. అందులో ఒకరితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేసి తన ప్రియుడు రమణారెడ్డికి షేర్ చేయగా వాటిని.. అతడు తన ఇన్‌స్టాగ్రామ్‍లో పోస్ట్ చేయడంతో నిజాలన్నీ బయటికి వచ్చాయని పేర్కొన్నాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‍లో వీడియోలు డిలీట్ చేయాలని రమణని సీతారాం కోరగా.. అతడు డిలీట్ చేయనని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపాడు. దీంతో సీతారాం, రేణుక కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు పట్టించుకోలేదని సీతారాం సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నాడు. వారు పోలీస్ స్టేషన్‌లో ఉండగానే రమణ మరోసారి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలిపాడు. దీంతో అక్కడి నుంచి తన భార్య రేణుక బాధతో వెళ్లిపోవడంతో.. ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిందని భావించి.. వెతుక్కుంటూ వెళ్లి చూడగా ఆమె రమణ ఇంట్లో ఉన్నట్లు భర్త సీతారాం గుర్తించాడు. ఇక వీడియోలు డిలీట్ చేయాలని వాగ్వాదానికి దిగగా.. అతడు చేయలేదని.. దీంతో రమణ తాగిన పురుగుల మందునే.. రేణుక కూడా తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని రాసుకొచ్చాడు.దీంతో హుటాహుటిన తన భార్య రేణుకను సీతారాం ఆస్పత్రికి తీసుకెళ్లి.. చికిత్స చేయించాడు. ఈ క్రమంలోనే రేణుక తండ్రిని పిలిపించి ఆమెను వారి పుట్టింటికి పంపించాడు. 2 నెలల తర్వాత అన్ని మర్చిపోయి కలిసి ఉందామని భార్య రేణుకను సీతారాం ఇంటికి తీసుకుకొచ్చాడు. అయితే 2 నెలల తర్వాత అంతే బాగానే ఉంది అనుకుంటుండగా.. మరో సంఘటన చోటు చేసుకుంది. ఒకరోజు 3 ఏళ్ల కుమారుడిని ఇంట్లోనే వదిలేసి.. రేణుక బయటికి వెళ్లిందని తెలిపాడు. రేణుక ఆటోలో స్కార్ఫ్ కట్టుకుని ప్రూఫ్ లేని కొత్త సిమ్ కోసం ప్రయత్నించిందని.. రమణ స్టేటస్‌లు కూడా చూసిందని సీతారాం తెలుసుకున్నాడు.అలా వెళ్లిన రేణుక 8 రోజులైనా తిరిగిరాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం.. తన భార్యకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నానని.. కానీ ఆమె తనకు నమ్మక ద్రోహం చేసిందని పేర్కొంటూ సూసైడ్‌ లెటర్ రాసి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ప్రియుడితో సన్నిహితంగా ఉన్న వీడియోలను అతడితోనే షేర్ చేసుకోవడం.. మరో ప్రియుడితో న్యూడ్ వీడియో కాల్స్ చేసుకోవడం, ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోవడం వంటి విషయాలన్నీ తెలిసి తట్టుకోలేని సీతారాం.. బాధతో సూసైడ్ నోట్ రాసి వాట్సప్ స్టేటస్ పెట్టి ప్రాణాలు తీసుకున్నాడు.అయితే సీతారాం కేసులో రమణా రెడ్డిని పట్టుకోవడంలో పోలీసులు అలసత్వం వహించడం.. సీతారాం ఆత్మహత్య చేసుకుని 3 నెలలు దాటినా నిందితులను అరెస్ట్ చేయడంలో ఆలస్యం చేశారని అతడి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.