ముఖ్యమంత్రి నారా నాయుడు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం (మే1) నుంచే ప్రారంభించారు. తెప్పించుకుంటున్నారు చంద్రబాబు. ప.. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రజా క్షేత్రంలో ఉండాలంటూ సూచనలు, సలహాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలను కూడా నిర్వహించారు. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ఇక నుంచి నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం సీఎం చంద్రబాబు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమావేశాల సందర్భంగా ఆ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచి తెలుసుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ చంద్రబాబు శుక్రవారం రోజున కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించారు. ఈ సందర్భంగానే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రతి సమావేశంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలను అడుగుతానన్న చంద్రబాబు.. పనితీరు బాగోలేకపోతే ఇంకో ఛాన్స్ ఉండదని స్పష్టం చేశారు. "ఎమ్మెల్యే పనితీరు గురించి ఈ రోజు నుంచి సమావేశాల్లోనే ప్రజలను అడుగుతా. మీరు చేతులెత్తకపోతే ఎమ్మెల్యే తన పనితీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యేలు పనితీరును సరిదిద్దుకోకపోతే ప్రజల తరుఫున ఉంటాను కానీ.. ఎమ్మెల్యేల తరుఫున ఉండను. వారికి మళ్లీ ఛాన్స్ ఉండదు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్న చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల పంపిణీని బరువుగా కాకుండా బాధ్యతలా చూస్తున్నామన్న చంద్రబాబు.. ఇందుకోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాల లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇదే సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల వరకూ విద్యుత్‌ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారు. కర్నూలు, గుంటూరు, అచ్యుతాపురం, అమరావతి, తిరుపతి, శ్రీసిటీలో ఈఎస్ఐ ఆస్పత్రులు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.