తరుచూ డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం.. భారతీయుడిపై జేపీ మోర్గాన్ లేడీ బాస్ అరాచకాలు

Wait 5 sec.

జేపీ మోర్గాన్ ఛేజెస్ లేవరేజ్డ్ ఫైనాన్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లోర్నే హజ్దినీ భారతీయుడైన తన జూనియర్ సహోద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. లైంగిక వేధింపులు, జాతివిపక్ష, వృత్తిపరమైన బలవంతానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ హజ్దినీపై న్యూయార్క్ కౌంటీ సుప్రీంకోర్టులో బాధితుడు (జాన్ డో) దావా వేశారు. వివాహితుడైన బాధితుడ్ని ‘బ్రౌన్ బాయ్’ అంటూ సంభోదించేదని, బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి తన కోరికలు తీర్చకపోతే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించేదని బాధితుడు వాపోయాడు. 2024లో తాము ఇద్దరూ కలిసి పనిచేయడం ప్రారంభించినప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని బాధితుడు పేర్కొన్నాడు. డైలీ మెయిల్ నివేదించిన ప్రకారం. ఒక సందర్భంలో హజ్దిని.. అతడు డెస్క్ పక్కన తన పెన్ను కిందపడేసి దాన్ని తీయడానికి వంగినట్టి నటించి, బాధితుడి కాలును రుద్దుతూ. ‘‘నువ్వు కాలేజీలో బాస్కెట్‌బాల్ ఆడావా? నాకు బాస్కెట్‌బాల్ ఆటగాళ్లంటే చాలా ఇష్టం’’ అని వ్యాఖ్యానించింది.అక్కడి నుంచి వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, ఆమెతో గడపడానికి నిరాకరిస్తే ‘‘నీ కెరీర్ నాశనం చేస్తాను.. నువ్వు నా కింది ఉద్యోగివని మర్చిపోకు’’ అని బెదిరించింది. సెప్టెంబర్ 2024లో తనతో శృంగారం చేయడానికి నిరాకరించడంతో మళ్లీ బెదిరించి, ‘యాజమాన్యం ఓ బ్రౌన్ బాయ్‌కు నాయకత్వం అప్పగిస్తుంది అనుకుంటున్నావా’ అని అవమానించింది. అంతేకాదు, ‘ఈ రాత్రికి నా కోరిక తీర్చకుంటే ప్రమోషన్ దక్కకుండా’ చేస్తానని హెచ్చరించింది. దీంతో భయపడిపోయిన బాధితుడు ఆమెకు లొంగిపోయాడు.రోహిప్నోల్ అనే డ్రగ్ (డేట్-రేప్ డ్రగ్).. అలాగే బలవంతపు లైంగిక చర్యల కోసం కొన్ని మందులు ఇచ్చినట్లు ఆమె తర్వాత అంగీకరించిందని దావాలో పేర్కొన్నారు. ఒకసారి హజ్దిని బాధితుడి అపార్ట్‌మెంట్‌కు వచ్చి లైంగికంగా వేధించింది. అంతేకాదు, అతడి భార్య కించపరిచేలా మాట్లాడుతూ.. తనను వదిలేయాలని అతడు ప్రాధేపడినా దారుణంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆమె ఆగడాలు రోజు రోజుకూ శ్రుతిమించడంతో బాధితుడు గతేడాది మేలో యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. అయితే, వీటిపై అంతర్గత విచారణ జరిపిన జేపీ మోర్గాన్.. ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తోసిపుచ్చింది. అంతేకాదు, అతడ్ని సంస్థ ఉద్యోగం నుంచి తొలగించడంతో రోడ్డునపడ్డాడు. ఇంతవరకూ ఉద్యోగం పొందలేకపోయాడు. కానీ, నిందితురాలు మాత్రం అదే సంస్థలో కొనసాగుతున్నారు. ఉద్యోగం దొరక్క ఆదాయం కోల్పోయి, మానసిక వేదన అనుభవిస్తున్నాడని, దీనికి పరిహారం ఇప్పించాలని బాధితుడి తరపు లాయర్ కోర్టును కోరారు.ఎవరీ లోర్నా హజ్దినీ?37 ఏళ్ల లోర్నా హజ్దినీ లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ కాలేజీ ఆఫ్ బిజినెస్ నుంచి ఫైనాన్స్, స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. గత 15 ఏళ్లుగా ఆమె జేపీ మోర్గాన్‌లో ఉద్యోగం చేస్తూ.. ప్రస్తుతం లెవరేజ్డ్ ఫైనాన్స్ విభాగం ఈడీగా కొనసాగుతున్నారు. వైస్-ప్రెసిడెంట్‌గా, కన్జ్యూమర్, రిటైల్, ఫార్మా/మెడ్‌టెక్, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, రక్షణ రంగాలలో ఆమెకు అనుభవం ఉంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తిచేశారు. జేపిమోర్గాన్‌లో చేరడానికి మెడికల్ డైరెక్టర్ ఆఫీసు, తర్వాత గ్లేజర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, ట్యూడర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు.