ఓపికే ముఖ్యం.. రోజుకు రూ. 200 ఆదా చేస్తే చాలు.. 60 ఏళ్ల వయసులో.. ప్రతి నెలా రూ. 6 లక్షల పెన్షన్ వస్తుంది!

Wait 5 sec.

: తెలివి కలిగిన వారు వేర్వేరు పనుల్ని చేయరు. చేసే పనుల్నే విభిన్నంగా చేస్తుంటారు. అలాగే స్మార్ట్ ఇన్వెస్టర్.. తెలివిగా పెట్టుబడులు పెట్టడం ద్వారా మిలియనీర్ లేదా బిలియనీర్ కావొచ్చు. ఉదాహరణకు సాధారణ ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్లలో నెలకు రూ. 6 వేల సిప్ పెట్టుబడి పెట్టడం ద్వారా 30 ఏళ్లలో ఇది రూ. 4.20 కోట్ల వరకు అవుతుంది. నెలకు రూ. 6 వేలు అంటే 30 రోజులకుగానూ ప్రతి రోజూ రూ. 200 ఆదా చేస్తే సరిపోతుంది. అదే స్మార్ట్ ఇన్వెస్టర్ ఏటా పెరిగే ఆదాయానికి తగ్గట్లుగా సిప్ మొత్తాన్ని పెంచడం ద్వారా ముందు వచ్చే రాబడికి దాదాపు రెండింతలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. ఇక్కడ అదనంగా పెద్దగా పెట్టుబడి అవసరం ఏం ఉండదు. కానీ క్లారిటీ ఉండాలి. తెలివి ఉండాలి. చాలా మంది ఇదే సూత్రం పాటించి సక్సెస్ అవుతుంటారు. చాలా వరకు మ్యూచువల్ ఫండ్లలో చిన్న వయసులోనే పెట్టుబడి ప్రారంభించి.. చాలా ఎక్కువ కాలం కొనసాగించాలి. ఇక్కడ 60 ఏళ్లు దాటిన తర్వాత.. సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ఆప్షన్ ఎంచుకోవడం మంచి రాబడి వస్తుంది. అప్పుడు సీనియర్ సిటిజెన్లకు రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం లేని వారికి పెద్ద మొత్తంలో నెలనెలా పెన్షన్ వస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో చాలా వరకు 15 శాతం వరకు వార్షికంగా సగటు రాబడి వస్తుంటుంది. ఇప్పుడు ప్రతి నెలా రూ. 6 వేల చొప్పున సిప్ పెట్టుబడి ప్రారంభించి.. 30 ఏళ్ల పాటు కొనసాగిస్తే.. ఇంకా ఏటా సిప్ పెట్టుబడి మొత్తాన్ని కనీసం 10 శాతం పెంచుతూ పోయినా.. ఇది మీ రిటైర్మెంట్ సమయానికి రూ. 9 కోట్లు అవుతుంది. అంటే 30 ఏళ్ల వయసులో ఈ పెట్టుబడి ప్రారంభించడం ద్వారా ఇలా జరుగుతుంది. అప్పుడు ఆ మెచ్యూరిటీ అమౌంట్ రూ. 9 కోట్లను 7 శాతం సగటు రాబడి అందించే పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా SWP ఆప్షన్ కింద ప్రతి నెలా రూ. 6 లక్షల వరకు పెన్షన్ అందుకోవచ్చు. ఇంకా వైద్య అత్యవసరాల కోసం రూ. 2.64 కోట్ల ఆపత్కాల నిధి కూడా అందుకోవచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా ఖర్చులు పెరుగుతుంటాయి. కాబట్టి.. 30 ఏళ్ల తర్వాత చూస్తే ఈ పెద్ద మొత్తంలో పెన్షన్ అనేది అప్పటికి ఎన్నో అవసరాల్ని తీరుస్తుంది. ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. అందుకు తగ్గట్లుగా వీలైనంత ఎక్కువ కార్పస్ అందించే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. గమనిక: పైన ఇచ్చింది కేవలం సమాచారం కోసమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్‌మెంట్.. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కాబట్టి ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.