ప్రైవేట్ ట్రస్టులో ఆస్తులు పెడితే బ్యాంకులు జప్తు చేయలేవా? అసలు గేమ్ ప్లాన్ ఏంటి? వివరాలిదిగో..

Wait 5 sec.

: మన దేశంలో బ్యాంకుల్ని మోసం చేసి.. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి.. ఏంచక్కా విదేశాల్లో తలదాచుకున్న వ్యాపారవేత్తలు ఎందరో ఉన్నారు. . వీరి తర్వాత ఇదే దారిలో వెళ్లిన వారు ఇంకా చాలా మందే ఉన్నారు. ఈ ఉదంతాల నేపథ్యంలో సామాన్యుల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. 'అసలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు.. ఇలా వేల కోట్ల అప్పులు చేసినా.. వ్యక్తిగతంగా వారి విలాసాలకు ఎలాంటి డోకా ఉండదు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినా.. వారి ఇళ్లు, కార్లు జప్తు కావు.' అసలు ఇదంతా ఎలా జరుగుతుంది.. నిజంగానే ఇది ట్రస్ట్ మాయాజాలమేనా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇంతకీ అసలు ట్రస్ట్ అంటే ఏంటి.. పబ్లిక్, ప్రైవేట్ ట్రస్టులు రెండు రకాలుగా ఉంటాయా.. ఇది బ్యాంకుల్ని బురిడీ కొట్టించే లీగల్ షీల్డేనా? చూద్దాం. సాధారణంగా ఆస్తులు మన పేరు మీద ఉంటాయి. అదే ట్రస్ట్ పరంగా చూస్తే.. ఇక్కడ ఆస్తి ఒక చట్టపరమైన వ్యవస్థ కిందికి వస్తుంది. దీంట్లో ముగ్గురు కీలక వ్యక్తులు ఉంటారు. సెట్లర్ అంటే ఆస్తిని ఇచ్చే వ్యక్తి.. ట్రస్టీ- ఆస్తిని నిర్వహించే వ్యక్తి.. లబ్ధిదారులు- ఆ ఆస్తి ద్వారా ప్రయోజనం పొందే కుటుంబ సభ్యులు. ఒకసారి ఆస్తిని.. ట్రస్టుకు బదిలీ చేసిన తర్వాత.. చట్టపరంగా దానికి యజమాని ట్రస్టే అని గుర్తుంచుకోవాలి.ప్రైవేట్ ట్రస్ట్- ధనవంతుల స్మార్ట్ ప్లానింగ్..కోటీశ్వరులు/ధనవంతులు మాత్రం.. చాలా వరకు తమ ఇళ్లు, భూములు, షేర్లు వంటి వాటిని.. ఎక్కువగా తమ పేరిట కాకుండా.. ప్రైవేట్ ట్రస్టుల పేరిట కొనుగోలు చేస్తుంటారు. దీని వల్ల కలిగే ప్రధాన లాభాల్ని చూస్తే.. తండ్రి తర్వాత కుమారుడు లేదా కుమార్తెలకు ఆస్తి వెళ్లాలంటే.. అప్పుడు వీలునామా, కోర్టుల చుట్టూరా తిరగాల్సి ఉంటుంది. అదే ట్రస్ట్ అయితే.. లబ్ధిదారుల జాబితాలో మార్పులు చేస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ రికార్డుల్లో వ్యక్తి పేర్లు కాకుండా.. ట్రస్ట్ పేరు ఉండటం వల్ల కూడా బయటి ప్రపంచానికి ఆస్తి ఎవరిది అనే విషయం పెద్దగా తెలియకపోవచ్చు. ఇది చాలా వరకు వివాదాలు లేకుండా చేయగలుగుతుంది. ట్రస్ట్ పేరిట ఆస్తులు ఉంటే.. బ్యాంకులు జప్తు చేయలేవా?ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే.. ట్రస్ట్ అనేది అప్పుల నుంచి తప్పించుకునే పూర్తి స్థాయిలో సేఫ్ లాకర్ ఏమాత్రం కానే కాదు. మీరు ఎలాంటి లోన్ తీసుకోకముందే.. లేదా ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడకముందే ఆస్తుల్ని ట్రస్టులకు బదిలీ చేస్తే.. అప్పుడు భవిష్యత్తులో వచ్చే వ్యాపార రిస్కుల నుంచి ఆస్తులకు చట్టపరంగా కొంత రక్షణ ఉంటుంది. అయితే. కావాలనే లోన్ ఎగ్గొట్టాలనే ప్లాన్ చేసి.. ఏదైనా ఈడీ లేదా ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాక.. ఉద్దేశపూర్వకంగానే ఆస్తుల్ని ట్రస్టులకు బదిలీ చేస్తే దానిని కోర్టులు మోసపూరిత బదిలీగా పరిగణిస్తుంటాయి. గతంలో విజయ్ మాల్యా కేసులో కూడా ఇదే జరిగింది. అప్పుడు దర్యాప్తు సంస్థలు.. ఆస్తుల మూలాల్ని వెతికి మరీ రికవరీ చేస్తాయి. టాక్స్ విషయంలో బెనిఫిట్స్ ఉంటాయా?చాలా మంది ట్రస్టుల్ని ఏర్పాటు చేస్తే.. టాక్స్ నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటుంటారు. కానీ ఇందులో పూర్తి స్థాయిలో నిజం లేదు. టాక్స్ బెనిఫిట్స్.. పబ్లిక్ ట్రస్టుల్లో మాత్రం ఉంటాయి. అంటే సేవా కార్యక్రమాల కోసం పెట్టేటువంటి.. పబ్లిక్ చారిటబుల్ ట్రస్టులకు మాత్రమే పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇదే విషయానికి వస్తే.. పన్ను మినహాయింపులు ఉండవు. ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయంపై ట్రస్టీ లేదా లబ్ధిదారులు తమ వ్యక్తిగత టాక్స్ శ్లాబ్ ప్రకారం.. పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇది టాక్స్ ఎస్కేప్ కాదు.. టాక్స్ మేనేజ్మెంట్ మాత్రమే.ట్రస్ట్ ద్వారా అక్రమంగా డబ్బులు దాచాలని చూస్తే.. అప్పుడు ఈడీ, ఐటీ శాఖలు వంటివి కచ్చితంగా రంగంలోకి దిగుతాయి. ఇక్కడ ట్రస్టీలు ఎవరు.. లబ్ధిదారులు ఎవరు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఇలా లోతుగా దర్యాప్తు చేస్తారు.? అక్రమ లావాదేవీలు రుజువైతే.. అప్పుడు ట్రస్ట్ ఆస్తుల్ని కూడా సీజ్ చేసే అధికారం ఉంటుంది.