జితేశ్ శర్మపై ఒకటే ట్రోలింగ్.. హీరో అన్నాడు జీరో అయ్యాడు!

Wait 5 sec.

అతన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ చేసింది. ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడిన ఆ ఇంటర్వ్యూలో చెప్పిన దానికి పూర్తి అపోజిట్‌గా జరుగుతుండటమే ఇప్పుడు ట్రోలింగ్‌కు ప్రధాన కారణమైంది. మ్యాచ్ జరిగిందంటే గెలిచినా, ఓడినా నెట్టింట ట్రోల్‌కు గురవుతూనే ఉన్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో మంచి రన్ రేట్ మెయింటేన్ చేసిన ఆర్సీబీ, వికెట్లను కూడా త్వరగానే కోల్పోయింది. 7.4వ ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన కీపర్ జితేశ్ శర్మ 8.1 బంతికే పెవిలియన్ బాట పట్టాడు. మూడే మూడు బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. దాంతో నెటిజన్లు జితేశ్ పాత స్టేట్‌మెంట్‌తో ట్రోలింగ్ మొదలుపెట్టాడు. ఇంతకీ జితేశ్ శర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏముందంటే.. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు జితేశ్ శర్మ ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడాడు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో జితేశ్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఓ డూ ఆర్ డై మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. దాంతో ఇంటర్వ్యూలో వీటి గురించి మాట్లాడుతున్న సందర్భంలో తానెప్పుడూ టాప్ ఆర్డర్ కుప్పకూలి పోవాలనే కోరుకుంటానని, ఎందుకంటే తనకు త్వరగా బ్యాటింగ్‌ వస్తే హీరోగా నిరూపించుకునే అవకాశం వస్తుందని అన్నాడు. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన జితేశ్ శర్మ ఒక్క మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. లక్నోపై మాత్రం 9 బంతుల్లో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. అది మినహా మిగతా ఏ మ్యాచ్‌లోనూ రాణించలేదు. ఐపీఎల్ 2026లో జితేశ్ శర్మ ఇన్నింగ్స్ ఇలా సాగింది.. 0 (1), 5 (8), 10 (9), 23 (9), 14 (20), 10 (6), 1 (3). మొత్తం ఈ సీజన్‌లో 53 బంతులు ఆడిన జితేశ్ శర్మ 62 పరుగులు మాత్రమే చేశాడు. అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోవడం, గతంలో టాప్ ఆర్డర్ కుప్పకూలితే హీరో అవుతానంటూ చెప్పిన కామెంట్స్‌తో నెటిజన్లు విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు.