ఒకటో తేదీన దిమ్మతిరిగే షాక్.. ఒక్కసారిగా రూ. 993 పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. లేటెస్ట్ రేట్లు ఇవే..

Wait 5 sec.

: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నేపథ్యంలో.. భారత్‌లో మరోసారి భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో.. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగుతున్న సంగతి తెలిసిందే. కిందటి రోజు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయిలకు కూడా చేరాయి. ఈ క్రమంలో దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇక్కడ వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్ని రికార్డు స్థాయిలో పెంచేశాయి. ఒక్కసారిగా రూ. 993 మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఒక్కరోజులో ధర పెరిగింది లేదు. సరిగ్గా దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక.. రికార్డు స్థాయిలో కేంద్రం ధరల్ని పెంచడం గమనార్హం. ఏప్రిల్ 29న పశ్చిమ్ బెంగాల్‌లో ఆఖరి విడతతో పోలింగ్ ముగిసింది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ. 993 పెరగ్గా.. 19 కిలోల సిలిండర్ ధర రూ. 3071.50 కి చేరింది. అంతకుముందు వరకు ఇది రూ. 2078.50 గా ఉండేది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 2031 నుంచి రూ. 3024 కు ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్‌‌లో కూడా రూ. 993.50 పెరగ్గా.. ఇది రూ. 3,251.50 కి చేరింది. హైదరాబాద్‌లో ఏప్రిల్ నెలలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,321 గా ఉండగా.. ఇప్పుడు ఇది రూ. 3315కు చేరిందని తెలుస్తోంది.మారని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు..ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం కాగా.. అప్పటి నుంచి వరుసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తొలుత మార్చిలో రూ. 144 పెరగ్గా.. . ఇప్పుడు అంతకుమించి పెరిగింది. మరోవైపు.. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు. ఇంట్లో అవసరాల కోసం దీనిని వినియోగిస్తారు. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 913 గా ఉండగా.. హైదరాబాద్ నగరంలో రూ. 965 పలుకుతోంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే.. హైదరాబాద్‌లోనే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. పెరగడంతో.. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసెస్, చిన్న వ్యాపారాలు, స్ట్రీట్ ఫుడ్ వంటివి నిర్వహించే వాణిజ్య వినియోగదారులపై భారీ ప్రభావం పడుతుంది. ఈ పెంపుతో.. బయట ఫుడ్ ధరలు మరింత భారీగా పెరగొచ్చన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. హోటల్ ఫుడ్ మరింత భారం కానుంది. రెస్టారెంట్లు బిల్లులు పెంచే అవకాశం ఉంది. అంటే ఇవి గ్యాస్ ధరల పెంపు భారాన్ని.. వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ఒకవైపు కొరత..ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద సరఫరా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు దేశాల్లో దిగుమతులు రాక.. ఇంధన సంక్షోభం నెలకొంది. మార్చిలో భారత్‌లో ఇది ఇంకా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. గ్యాసి సిలిండర్ బుకింగ్స్ కాలేదు. బుక్ చేసిన చాలా రోజులకు వచ్చేది. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. . చాలా వరకు హాస్టల్స్, హోటల్స్ తాత్కాలికంగా మూసేశారు. మిగతా హోటల్ నిర్వహకులు ధరల్ని పెంచేశారు. కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు కూడా క్యాంటీన్స్ మూసేశాయి.