తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇకపై ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా సాయం అందనుంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో అత్యాధునిక మాడ్యూళ్లను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ మరింత పకడ్బందీగా, వేగంగా సాగనుంది. గతంలో ఉన్న మాన్యువల్ విధానాలకు స్వస్తి పలికి, పూర్తిస్థాయి డిజిటలైజేషన్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో డేటా సేకరణలో గానీ, లబ్ధిదారుల ఎంపికలో గానీ ఎటువంటి పొరపాట్లకు తావుండదని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం ప్రభుత్వం ఎల్‌-1 జాబితాలో చేర్చి ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23.30 లక్షల మంది ఈ జాబితాలో ఉండగా.. స్థలం కూడా లేని వారు 21.49 లక్షల మంది ఎల్‌-2 జాబితాలో ఉన్నారు. అనర్హులుగా తేలిన 32.98 లక్షల మందిని ఎల్‌-3 జాబితాలో చేర్చారు. ఈ డేటాను నిర్వహించడం, ఎప్పటికప్పుడు మార్పులు చేయడం కష్టతరంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్తగా ప్రవేశపెట్టిన మాడ్యూళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక, మార్పులు, చేర్పులు, అనుమతుల ప్రక్రియ ఇకపై క్షణాల్లో జరిగిపోనుంది.గతంలో లబ్ధిదారుల అర్హతను నిర్ధారించడానికి గెజిటెడ్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి మాన్యువల్‌గా నివేదికలు ఇచ్చేవారు. దీనివల్ల డేటా ఎంట్రీలో జాప్యం, పొరపాట్లు జరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు యాప్‌లోనే అర్హులైన లబ్ధిదారులు, మొత్తం విచారణ జరిపిన లబ్ధిదారులు అనే రెండు కొత్త ఆప్షన్లను చేర్చారు. అధికారులు నేరుగా యాప్‌లోనే వివరాలను నమోదు చేయగానే.. ఆ సమాచారం వెంటనే ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌కు చేరుతుంది. అక్కడ పరిశీలన పూర్తయిన తర్వాత కలెక్టర్ల ఆమోదానికి వెళ్తుంది. ఈ క్రమబద్ధీకరించిన విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు.పథకం అమలులో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య లబ్ధిదారుల ఎంపిక. తాము అర్హులమైనా ఎల్‌-3 (అనర్హుల) జాబితాలో చేర్చారని వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిని పరిష్కరించేందుకు ఎల్‌-3 నుంచి ఎల్‌-1 అనే ప్రత్యేక మాడ్యూల్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఒకవేళ పొరపాటున అర్హులు అనర్హుల జాబితాలో ఉంటే.. తగిన ఆధారాలతో వారిని తిరిగి అర్హుల జాబితాలోకి మార్చే అధికారం ఇప్పుడు సులభతరం చేయబడింది. దీనివల్ల ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.అంతేకాకుండా.. పరిపాలనాపరమైన అధికారాలను వికేంద్రీకరిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్ మార్పులు, ఈ-కేవైసీ సమస్యలు, బిల్లుల చెల్లింపులో జాప్యం వంటి అంశాలపై గతంలో రాష్ట్ర స్థాయి ఎండీ నుంచి అనుమతులు రావాల్సి ఉండేది. దీనివల్ల లబ్ధిదారులు వారాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ అధికారాలన్నింటినీ జిల్లా కలెక్టర్లకే అప్పగించారు. స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునే వీలు కలగడంతో.. ఇళ్ల నిర్మాణం సజావుగా సాగడమే కాకుండా, లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వేగంగా జమ అవుతాయి. ఈ సంస్కరణలు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన గృహ నిర్మాణ పథకంగా తీర్చిదిద్దుతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.