AP Cabinet Meeting Highlights - 30/04/2026(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీక్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 30/04/2026====================Cabinet Decisions - Press Briefing byHon'ble Minister for Finance, Planning, Commercial Taxes & LegislativeAffairs, Sri. Payyavula Keshav at Publicity Cell, Block-4, AP Secretariat on30-04-2026 | LIVEఏపీక్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవేYouTube Link:https://www.youtube.com/watch?v=xG5R9x7RQ-M====================ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగాకేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విలేకరులకువివరించారు.కేబినెట్నిర్ణయాలు ఇవే:1. అమరావతిక్వాంటమ్ వ్యాలీలో రూ.1,208 కోట్లతో ట్విన్ఆఫీస్ టవర్ల నిర్మాణ ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.2. దిల్లీలోరాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా రూ.124.5 కోట్లతో 11 ఎకరాల్లో నూతన ఏపీభవన్ నిర్మించాలని నిర్ణయించింది. 3. డిజైన్, భవన నిర్మాణ బాధ్యతలు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కార్పొరేషన్ (ఎన్బీసీసీ)కు అప్పగించాలన్న ప్రతిపాదనలు ఆమోదించింది. శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తిలో కేంద్ర రక్షణ సంస్థ డీఆర్డీవో చేపట్టే రక్షణ పరిశ్రమ కోసం 600 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.3. అమరావతిలోకృష్ణా నది కుడి గట్టు వద్ద వరద నిరోధక నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు రూ. 443.26 కోట్లతో మూడు ప్యాకేజీలుగా పనులు. కొత్త టెండర్లుపిలిచేందుకు ఏపీసీఎల్ సీఎండీకి అనుమతి.4. అమరావతిలోనిర్మిస్తున్న సచివాలయం, హెడ్ డీల కార్యాలయభవనాలకు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీప్యానెల్,బీఎంయూ పనుల కోసం రూ.2,540 కోట్ల పనులకు ఆమోదం. పనులు చేపట్టేందుకు మూడు ప్యాకేజీల కింద టెండర్లుపిలవడానికి ఏజీఐసీఎల్ ఎండీకి అనుమతి. 5. రాజధానిలోశాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, రూఫ్, పాలవాగు మీదఅనుసంధాన వంతెనలు తదితర నిర్మాణాల కోసం రూ.798 కోట్లకు పరిపాలన అనుమతులు. 6. అమరావతిజోన్-11 పరిధిలో ఉండవల్లిలో భూసమీకరణ పథకంలోచేపడుతున్న లేఔట్లలో రహదారులు, కాలువలు, నీటి సరఫరా, మురుగునీటిపారుదల,విద్యుత్తువ్యవస్థ తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.580 కోట్లకు పరిపాలన అనుమతులు. సీఆర్డీఏ నిధుల నుంచి ఈ పనుల్ని చేయనున్నారు.7. సీఆర్డీఏపరిధిలోని ఎన్ 10 ఈ1 జంక్షన్ నుంచి ఎన్13- ఈ1 జంక్షన్ వరకూ 220 కేవీ ఈ హెచ్పీ లైన్ బ్యాలెన్స్ పనుల్ని యూజీ కేబుల్స్ ద్వారా రీరూటింగ్చేయడానికి సవరించిన అంచనా రూ.1,180.54 కోట్లకు పాలనామోదం. 8. ఆర్-5 జోన్లో గతంలో రెవెన్యూ శాఖకు ఇచ్చిన భూముల్ని రద్దు చేసి, వెనక్కుతీసుకునేందుకుసీఆర్డీఏకు అనుమతి. 9. భూసమీకరణలో రైతుల కోరిక మేరకు యాన్యుటీ మొత్తం పెంపు, రుణ మాఫీ కటాఫ్ తేదీ పెంపు తదితర నిర్ణయాలకు ఆమోదం. 10. రాజధానిప్రాంతంలో సెబీకి 1.5 ఎకరాలు, స్వామి నారాయణ్ గురుకులం, అగ్నిమాపకశాఖ, డీఏవీ పబ్లిక్స్కూల్లకు సీఆర్డీఏ చేసిన భూకేటాయింపులకు ఆమోదం. 11. సుప్రీంకోర్టుఆదేశాలతో రాష్ట్ర న్యాయ విభాగాల్లో 21 కొత్తపోస్టుల మంజూరు. ఒక కోర్టు చీఫ్ మేనేజర్, ఐదు సీనియర్కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్పోస్టుల కల్పన. 12. భోగరాజుపట్టాభి స్మారక భవనానికి 1.5 ఎకరాల కేటాయింపు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డా. భోగరాజు పట్టాభి సీతారామయ్యస్మారక భవన నిర్మాణం, సేవా కార్యక్రమాలనిర్వహణ కోసం 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని సంబంధితట్రస్టుకు రూ.37.56 కోట్లకు కేటాయించాలనే ప్రతిపాదనకుఆమోదం13. ఏపీప్రత్యేక రక్షణ దళంలో 23 ఏళ్లుగాపదోన్నతులకు నోచని 385 మందికి హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి. 14. రామాయపట్నంపోర్టులో డ్రెడ్జింగ్ ద్వారా తీసిన మట్టిని పారవేసే ప్రదేశం మార్చడంతో వచ్చిన రూ.354 కోట్ల అదనపు ఖర్చుకు ఆమోదం. 15. ఎన్సీడీసీనుంచి రూ.1,800 కోట్ల రుణంతీసుకునేందుకు మార్క్ ఫెడ్క గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. 16. అన్నిపట్టణ స్థానిక సంస్థల్లో మ్యుటేషన్ ఛార్జీలు ఒకేలా ఉండేలా మున్సిపల్ చట్టాల సవరణముసాయిదాకు ఆమోదం. 17. పోలవరంనిర్వాసితులకు ఆర్థిక సాయం పెంపు. పోలవరం ప్రాజెక్టునిర్వాసితులకు గతంలో ప్రభుత్వమే కాలనీ అభివృద్ధి చేసి, గృహ నిర్మాణం చేపట్టేది. కానీ వన్ టైం సెటిల్మెంట్ఎంచుకున్నవారికి గృహ నిర్మాణానికి రూ.2.85 లక్షల నుంచి 3.57 లక్షలకు పెంచాలనినిర్ణయం. వేరో చోట ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి స్థలం విలువ రూ. లక్ష నుంచిరూ. రెండు లక్షల పెంపునకు అనుమతి. 18. శ్రీసత్యసాయిజిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్-2 పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కాలువను సిమెంట్ కాంక్రీట్లైనింగ్తో ఆధునికీకరించేందుకు రూ.309 కోట్ల పనులకు అనుమతి.19. జాతీయక్రీడా పాఠశాల నిర్మాణానికి పదెకరాలు. తిరుపతి జిల్లారేణిగుంట మండలం కుర్రకాల్వలో అంతర్జాతీయ క్రీడా పాఠశాల నిర్మాణం కోసం సన్రైజ్ఎడ్యుకేషనల్ ఇనీషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎకరా రూ.1.12 కోట్ల చొప్పున 10.10 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు ఆమోదం.20. ప్రకాశంజిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం 22.74 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి రూ.3.18 కోట్ల చెల్లింపుపై కేటాయించేందుకు అనుమతి. 21. అసెప్టిక్ప్యాకింగ్ యూనిట్ అప్ డేషన్, పండ్లు, కూరగాయల నుంచి పల్ప్ తీయడానికి మౌలిక సదుపాయాలుకల్పించేందుకు చిత్తూరు జిల్లా యాదమరి మండలం మాజర కొత్తపల్లిలో ఏపీ ట్రేడ్ప్రమోషన్ కార్పొరేషన్కు 13.17 ఎకరాల ప్రభుత్వభూమిని ఎకరా రూ. లక్షన్నరకు ఇచ్చేందుకు ఆమోదం.22. అనంతపురంజిల్లా గుత్తిలో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి కోసం 11.82 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా రూ.12.60 లక్షల చొప్పున అనంతపురం- హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థకుకేటాయింపునకు ఆమోదం. 23. శ్రీకాకుళంజిల్లా బుడగట్లపాలెం, అనకాపల్లిజిల్లాలోని పూడిమడక, ప్రకాశం జిల్లాకొత్తపట్నంలో రూ.1,586.69 కోట్లతో మూడుఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సవరించిన అంచనాలకు పరిపాలనా అనుమతులు. పూడిమడకలోఫిషింగ్ హార్బర్ ను సమీప పారిశ్రామిక క్లస్టర్లకు ఉపయోగపడేలా కార్గో హ్యాండ్లింగ్సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు. దీని వల్ల రహదారి రద్దీ తగ్గుతుంది.24. ఏపీ పవర్కోఆర్డినేషన్/ డిస్కంలకు రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రూ.7 వేల కోట్ల ఎంటీఎల్ రుణాలకు షరతులతో ప్రభుత్వ హామీపొడిగింపు.====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});