సర్జరీ తర్వాత తొలిసారి బయట కనిపించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా!

Wait 5 sec.

టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు కి సర్జరీ జరిగిందనే సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో, వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సర్జరీ తర్వాత పవన్ తొలిసారి బయట కనిపించారు. సీఎం నాయుడు శనివారం పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ఫోటోలు బయటకు రావడంతో, ఉపముఖ్యమంత్రి ఇప్పుడు ఎలా ఉన్నారనేది అందరికీ తెలిసింది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.తమ నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రికి పవన్, అన్నా లెజినోవా దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకి చంద్రబాబు పుష్పగుచ్ఛం అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జనసేన అధినేతను చంద్రబాబు పరామర్శించిన ఫొటోలు, వీడియోలను ఆయన టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు స్వాగతం పలికారు'' అని పవన్ కళ్యాణ్ టీమ్ పేర్కొంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫోటోలలో పవన్ నీరసంగా కనిపిస్తున్నారు.సర్జరీకి ముందు గడ్డం మీసాలతో ఉన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. కాకపోతే కాస్త వీక్ గా కనిపిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత పవన్ కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన నీరసంగా ఉండటం చూసి, కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని ఇంకా బలహీనంగా ఉన్నారని, ఆయన ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని కోరుతున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ బయటకు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ ఇటీవలే 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ప్రేక్షకులను పలకరించారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. పవర్ స్టార్ కెరీర్ లో అతి పెద్ద పరాజయాల లిస్టులో చేరింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ లభించడం లేదు. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అలానే 'ఓజీ 2'కూడా లైనప్ లో ఉంది. కాకపోతే ప్రస్తుతానికి ఆయన ఎలాంటి కొత్త సినిమాలను టేకప్ చేయడం లేదని ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సంస్థ ప్రకటించింది. 'ఓజీ 2'పై స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారని తెలిపింది. సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అత్యవసర సమావేశాల్ని ఇంటి నుంచే నిర్వహిస్తున్నారని సమాచారం.