క్రెడిట్ కార్డు బిల్లు కోసం.. రూ.13 లక్షల 'క్యాష్' కట్టిన వ్యక్తికి ట్యాక్స్ నోటీసులు.. చివరకు ఏం జరిగిందంటే?

Wait 5 sec.

Tax Notice: ముంబైలోని శివాజీ పార్క్‌కు చెందిన మెహతా అనే వ్యక్తి తన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో ఆదాయం రూ.6.3 లక్షలుగా చూపించారు. అయితే తన క్రెడిట్ కార్డు బిల్లును రూ.27.65 లక్షలు చెల్లించాడు. అందులో నగదు రూపంలో రూ.13.95 లక్షలు చెల్లించాడు. దీంతో హైవాల్యూ నగదు చెల్లింపులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలు చేపట్టింది. ఎలాంటి ధ్రువీకరణ లేని ఆదాయంగా పేర్కొంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం మెహతాకు నోటీసులు పంపించింది.తన కుటుంబ సభ్యులు తనపై ఉన్న ప్రేమను చూపిస్తూ రూ.15.5 లక్షలు నగదు ఇచ్చారని, ఇందులోని రూ.13.95 లక్షలను క్రెడిట్ కార్డు బిల్లుగా చెల్లించాలని మెహతా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య రూ.3 లక్షలు, తండ్రి రూ.8 లక్షలు, తల్లి రూ.4.5 లక్షలు ఇచ్చారని వివరించారు. అయితే, మెహతా ఇచ్చిన వివరణకు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సంతృప్తి చెందలేదు. గుర్తించదగిన ధ్రువీకరణ పత్రాలను చూపించాలని ఆదేశించారు. ఆదాయానికి అఫిడవిట్ అనేది సమర్థించదగిన ప్రూఫ్ కాదని చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఈ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించారో తెలియజేయాలని కోరారు. మెహతా వివరణను అసెసింగ్ ఆఫీర్‌ ఆమోదించలేదు. నగదు రూపంలో చెల్లించిన రూ.13,95,020ని ఎలాంటి ఆధారాలు లేని డబ్బులుగా భావించి సెక్షన్ 69ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీంతో సదరు ట్యాక్స్ పేయర్లు కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీల్స్ సీఐటీఏ వద్ద అప్పీల్ చేశారు. అక్కడ సైతం తన కుటుంబ సభ్యుల నుంచే ఆ డబ్బులు వచ్చినట్లు వివరించారు. సమర్థించింది. మెహతా చెప్పిన వివరాలను నమ్మలేమని, అతని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నరనే విషయంతో ఇక్కడ ధ్రువీకరించలేమని స్పష్టం చేసింది. ఎదైనా వ్యాపారం చేస్తున్నారు అనేందుకు కూడా ఎలాంటి ప్రూఫ్ లేదని పేర్కొంది. ఈ తీర్పు సైతం అనుకూలంగా రాకపోవడంతో ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (ITAT) ముంబైని మెహతా ఆశ్రయించారు. అడ్వకేట్ కింజాల్ భూతా అతని తరపున వాదనలు వినిపించారు. భార్య నుంచి వచ్చిన రూ.3 లక్షలు అతడి సొంత అకౌంట్ నుంచే వచ్చాయని ట్యాక్స్ ఆఫీసర్ ఆరోపించారు. అయితే ఐటీఏటీ బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలించిన తర్వాత అతని భార్య ప్రొఫెషనల్ సర్వీసెస్ అందిస్తోందని, ఆమెనే ఆ డబ్బులు ఇచ్చినట్లు గుర్తించింది. అతను తన భార్య నుంచి వచ్చిన డబ్బులుగా చెప్పడం సబబేనని తెలిపింది. రూ. 3 లక్షలను ట్యాక్స్ పరిధి నుంచి తొలగించింది. అయితే, మొత్తం రూ.13.95 లక్షల్లో రూ.4.7 లక్షలు మాత్రం ఎలాంటి ఆధారం లేని డబ్బులుగా తేల్చి పాక్షిక ఉపశమనం కల్పించింది. ఐటీఏటీ ముంబై ఎదుట మెహతా తరఫున వాదిస్తున్న న్యాయవాది కింజల్ భూటా, ఆ నగదు తన తండ్రి, తల్లి, భార్య ఇచ్చారని అతను మొదటి నుంచీ పన్ను అధికారికి చెబుతూనే ఉన్నందున, ఆ నగదు మూలం అస్పష్టంగా ఏమీ లేదని వాదించారు. అయినప్పటికీ రూ.4 లక్షలు, రూ.2.25 లక్షలు, రూ.3 లక్షలను పన్ను పరిధి నుంచి తొలగించారు. రూ.4.7 లక్షలకు పన్ను చెల్లించాలని నిర్ణయించారు. దీంతో భారీ ఊరట లభించినట్లయింది.