రాజస్థాన్‌కు కఠిన పరీక్షే.. పాయింట్ల పట్టికలో పైకొచ్చిన ఢిల్లీ.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఇదే మార్గం

Wait 5 sec.

సెకండ్ హాఫ్ చాలా ఆసక్తిగా జరుగుతోంది. ఇప్పటి వరకు వరుసగా గెలిచిన జట్లు ఒక్కొక్కటిగా ఓడిపోతుంటే కింద ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. మొదట . ఈ లిస్ట్‌లో సన్‌రైజర్స్ ఒక్కటే గెలవడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ టార్గెట్ అందించినా ఢిల్లీ క్యాపిటల్స్ దాన్ని ఊదేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 225/6 పరుగులు చేసింది.. నిస్సాంక, కేఎల్ రాహుల్ రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానానికి వచ్చేసింది. ఇక ఆరులో ఉన్న సీఎస్కే ఏడో స్థానానికి పడిపోయింది. ఢిల్లీపై ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం తన నాలుగో స్థానంలోనే ఫిక్స్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచి, ఐదు ఓడింది. మొత్తం ఎనిమిది పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఏదో స్థానం నుంచి ఆరో స్థానానికి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ పది మ్యాచ్‌లు ఆడి ఆరు గెలిచి, నాలుగు ఓడింది. 12 పాయింట్లతో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ తన మిగతా ఐదు మ్యాచ్‌లలో కచ్చితంగా నాలుగు గెలవాల్సిందే. ఆ జట్టును టచ్ చేయకుండా ఉండాలంటే వరుసగా ఐదు గెలిస్తే ప్లే ఆఫ్స్‌లో ఫిక్స్ అయిపోవచ్చు. ఢిల్లీ తన మిగతా ఐదు మ్యాచ్‌లలో సీఎస్కే, పంజాబ్, రాజస్థాన్‌తో ఒక్కొక్క మ్యాచ్ ఆడనుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మాత్రం రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఐదింటిలో నాలుగు గెలిచినా ప్లే ఆఫ్స్ బరిలో నిలవొచ్చు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లో ఆడాలంటే ఆఖరి నాలుగు మ్యాచ్‌లలో కచ్చితంగా మూడు గెలవాల్సిందే. ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఆరు గెలిచి 12 పాయింట్లతో కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాజస్థాన్ మూడు గెలిస్తే ఫ్లే ఆఫ్స్ ప్లేస్ ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ తన మిగతా నాలుగు మ్యాచ్‌లను గుజరాత్, ఢిల్లీ, లక్నో, ముంబైతో తలపడనుంది. దాంతో ఇప్పుడు రాజస్థాన్‌కు కూడా ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం కత్తి మీద సాములాగే కనిపిస్తోంది.