గత వారం ముంబయిలో ఒకే కుటుంబానికి చెందిన కారణంగా ప్రాణాలు కోల్పోయారనే వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ న్యూస్‌తో తినడంపై చర్చలు మొదలయ్యాయి. ఈ ఘటన కొన్ని ప్రాంతాలలో ధరలు కూడా పడిపోయాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, అసలు కారణం పుచ్చకాయ కాదని, బాధితుల శరీరంలోని కొన్ని అవయవాలను ఆకుపచ్చగా మారిన ఒక ప్రమాదకరమైన పదార్థమని, ఇది జరిగి ఉండవచ్చని సూచిస్తోంది.మొబైల్ యాక్సెసరీస్ దుకాణం నడిపే 45 ఏళ్ల అబ్దుల్లా డొకాడియా, అతడి భార్య నస్రీన్ (35), వారి ఇద్దరు పిల్లలు జైనాబ్ (13), అయేషా (16) శనివారం బంధువులతో కలిసి డిన్నర్ చేశారు. బంధువులు వెళ్లిపోయిన తర్వాత ఆ కుటుంబం తెల్లవారుజామున సుమారు 1 గంటకు పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5 గంటలకల్లా వారంతా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు డయేరియా లక్షణాలు కనిపించడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని స్పష్టమైంది. వారు కొన్ని గంటల్లోనే మరణించారు.విషప్రయోగమేనా? బాధితుల మెదడు, గుండె, పేగులతో సహా కొన్ని అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు ప్రాథమిక ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసు పర్యవేక్షిస్తున్న వైద్య నిపుణులు.. అంతర్గత శరీర మార్పులు, సాధారణ ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలతో సరిపోలడం లేదని పేర్కొన్నారు. మరింత మిస్టరీ ఏంటంటే శక్తివంతమైన నొప్పి నివారణ మందు మార్ఫిన్‌ అవశేషాలను అబ్దుల్లా డొకాడియా శరీరంలో గుర్తించినట్లు వర్గాలు వెల్లడించాయి. అత్యంత తీవ్రమైన నొప్పి నివారణకు వాడే ఔషధం అతడి శరీరంలోకి ఎలా వచ్చిందనే కోణంలో విచారిస్తున్నారు. చికిత్సలో భాగంగా తీసుకున్నారా? అనుకోకుండా జరిగిందా? లేదా మరేదైనా అనుమానాస్పద అంశాన్ని సూచిస్తుందా? అని ఆరా తీస్తున్నారు.వారి మరణాలకు, పుచ్చకాయకు మధ్య ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం రుజువు కాలేదని, శాస్త్రీయ నిర్ధారణ తర్వాతే తుది నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం పేర్కొంది. తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక, గత వారం ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితులతో పాటు బిర్యానీ తిని సురక్షితంగా బయటపడిన వారి బంధువుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకున్నారు.ఆ కుటుంబం ఒత్తిడికి గురైందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు తిన్న పుచ్చకాయలో ఏదైనా విషపదార్థం లేదా కల్తీ ఉందా అని దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక, పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉంది. అలాగే, నాలుగు మృతదేహాల అంతర్గత అవయవాలను రసాయన విశ్లేషణ కోసం పంపారు.