ప్రతీ జిల్లాలో అరకు కాఫీ.. షాప్‌లు పెట్టుకునేందుకు మహిళలకు రుణాలు, సబ్సిడీలు

Wait 5 sec.

అంటే ఇష్టపడని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇక అరకు కాఫీకి ఆంధ్రప్రదేశ్, భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ అరకు కాఫీని కేవలం టేస్ట్ కోసం మాత్రమే కాకుండా.. మహిళలకు ఆర్థిక శక్తిని అందించే అస్త్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ అరకు కాఫీ ఔట్‌లెట్‌లను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో మహిళలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్రంలో మహిళల సాధికారత సాధించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మహిళలకు సాధికారత కల్పించే దిశగా.. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థతో తాజాగా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మెప్మా మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ ఆధ్వర్యంలో ఈ ఎంవోయూ కుదిరింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఫ్రాంచైజీల విధానంలో అరకు కాఫీ దుకాణాలను ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రానున్న 2 ఏళ్ల కాలంలో ప్రతీ జిల్లాలో రెండు చొప్పున అరకు కాఫీ ఔట్‌లెట్‌లను ప్రారంభించనున్నారు. ఈ అరకు కాఫీ దుకాణాల ద్వారా.. స్థానికంగా ఉండే మహిళలకు ఉద్యోగాలతోపాటు.. వ్యాపార అవకాశాలు కూడా కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో నేటివ్ అరకు కాఫీ సంస్థతో మెప్మా ఈ కీలక ఒప్పందం చేసుకుంది. ఇక ఈ ఫ్రాంచైజీలను రెండు రకాలుగా అందించాలని భావిస్తున్నారు. మొదటిది రూ.5.90 లక్షలతో ఒక కాఫీ దుకాణం కాగా.. మరొకటి రూ.10 లక్షలతో మొబైల్ కాఫీ షాప్ వంటి 2 మోడల్స్‌ను ప్రస్తుతానికి మెప్మా, నేటివ్ అరకు కాఫీ కలిసి ఎంపిక చేశారు. ఇక ఈ అరకు కాఫీ ఫ్రాంచైజీలు తీసుకునే ఆసక్తి ఉన్న మహిళలకు రుణాలు, సబ్సిడీలను కూడా అందించనున్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్‌ఎంఈ).. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) వంటి పథకాల కింద మహిళలకు లోన్లు, సబ్సిడీలు అందజేస్తారు. ఈ ఒప్పందంతో అరకు కాఫీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం మాత్రమే కాకుండా మహిళలకు ఆర్థిక చేయూత దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు.